Karthika Deepam To Janaki Kalaganaledu: యూత్ కి హాట్ ఫేవరెట్ గా మారిన సీరియల్ హీరోయిన్స్!
టీవీ సీరియల్స్ అంటే గృహిణులు మాత్రమే చూస్తారని అనుకుంటారు. కానీ ఈ మధ్యకాలంలో యూత్ ని ఆకట్టుకునే సీరియల్స్ కూడా వస్తున్నాయి. తెలుగు టీవీ చరిత్రలో కొత్త ట్రెండ్ ను తీసుకొస్తున్నాయి నేటి సీరియల్స్. ముఖ్యంగా సీరియల్స్ లో హీరోయిన్లుగా చాలా అందంగా ఉన్నవారిని క్యాస్ట్ చేస్తున్నారు. పక్క రాష్ట్రాల నుండి అమ్మాయిలను దిగుమతి చేసుకుంటూ మన తెలుగు సీరియల్స్ లో నటింపజేస్తున్నారు. చూడడానికి సినిమా హీరోయిన్ల రేంజ్ లో ఉన్న వీళ్లను చూస్తూ యూత్ ఫిదా అయిపోతుంది. అలా టీవీ సీరియల్స్ ద్వారా యువతకు క్రష్ గా మారిన హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం!
Download ABP Live App and Watch All Latest Videos
View In Appశోభాశెట్టి - 'కార్తీకదీపం' సీరియల్ లో మోనిత అనే నెగెటివ్ క్యారెక్టర్ పోషిస్తుంది ఈ బ్యూటీ. సీరియల్ లో ఆమెని చాలా అందంగా చూపిస్తున్నారు. ఆమె కాస్ట్యూమ్స్ కూడా బాగుంటాయి. ఈ బ్యూటీ కోసం సీరియల్ చూసే చాలా మంది అబ్బాయిలు ఉన్నారు.
ఐశ్వర్య - బుల్లితెరపై 'కస్తూరి' అనే సీరియల్ తో ప్రేక్షకులకు దగ్గరైంది. తన క్యూట్ లుక్స్ తో యూత్ ని ఫిదా చేస్తోంది.
అర్చన అనంత్ - 'కార్తీక దీపం' సీరియల్ లో హీరో తల్లి క్యారెక్టర్ చేస్తోన్న ఈమెకి వయసు తక్కువే. పాత్ర ప్రకారం సీరియల్ లో ఎంతో హుందాగా కనిపిస్తుంటుంది. ఈమెకేం తక్కువ ఫాలోయింగ్ లేదు.
సోనియా సింగ్ - 'యమలీల' సీరియల్ లో హీరోయిన్ గా కనిపిస్తోన్న ఈ బ్యూటీ తన ఇన్నోసెంట్ లుక్స్ తో ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరిస్తోంది. ఈమెలో హీరోయిన్ ఫీచర్స్ ఉన్నాయంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తుంటారు.
నవ్య స్వామీ - బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించిన నవ్య ప్రస్తుతం 'నా పేరు మీనాక్షి' సీరియల్ లో నటిస్తోంది. తన క్యూట్ లుక్స్, మాటలతో యూత్ కి హాట్ ఫేవరెట్ గా మారింది.
యష్మి గౌడ - 'నాగభైరవి' సీరియల్ లో భైరవి పాత్ర పోషిస్తోన్న ఈ బ్యూటీ చూడడానికి కాస్త 'జాతిరత్నాలు' హీరోయిన్ మాదిరి ఉంటుంది. ఈమెకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.
ప్రియాంక జైన్ - 'మౌనరాగం' అనే సీరియల్ లో మూగ అమ్మాయిగా నటించింది ఈ భామ. డైలాగ్స్ లేకపోయినా.. తన హావభావాలతో ఆకట్టుకుంది. ఈమెకి ఓ సినిమాలో ఛాన్స్ కూడా వచ్చింది. ప్రస్తుతం స్టార్ మాలో 'జానకి కలగనలేదు' అనే సీరియల్ లో నటిస్తోంది.