crickters Bat Weight: కోహ్లీ బ్యాట్ బరువు ఎంత? అందరికంటే ఎక్కువ బరువున్న బ్యాట్ ఎవరిది?
క్రికెటర్లు వాడే బ్యాట్ బరువు ఎంత ఉంటుంది? ఇప్పటి వరకు అత్యధిక బరువు గల బ్యాట్ ఎవరు వాడారు? తక్కువ బరువు గల బ్యాట్ ఎవరు వాడారో ఇప్పుడు చూద్దాం.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appభారత పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ బ్యాట్ బరువు 1.22కేజీలు. లైట్ వెయిట్ కేటగిరీకి చెందిన బ్యాట్‌ని కోహ్లీ వాడుతున్నాడు.
ఇప్పటి వరకు అత్యంత బరువైన బ్యాట్ వాడిన క్రికెటర్ దక్షిణాఫ్రికాకు చెందిన లాన్స్ క్లెన్సర్. ఇతని బ్యాట్ బరువు 1.53 కేజీలు.
క్రికెట్ దేవుడు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ బ్యాట్ బరువు 1.47కేజీలు. అత్యధిక బరువు గల బ్యాట్ వాడిన రెండో ఆటగాడు సచిన్.
ప్రపంచకప్‌ల హీరో మహేంద్ర సింగ్ ధోనీ బ్యాట్ బరువు 1.25కేజీలు.
దక్షిణాఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్ బ్యాట్ బరువు 1.19కేజీలు.
విధ్వంసకర బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ బ్యాట్ బరువు 1.36కేజీలు.
న్యూజిలాండ్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ బ్యాట్ బరువు 1.12కేజీలు.
వెస్టిండీస్ ఆటగాడు అండ్రూ రసెల్ బ్యాట్ బరువు 1.2 కేజీలు.
డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బ్యాట్ బరువు 1.35కేజీలు
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ బ్యాట్ బరువు 1.22 కేజీలు