Mithali Raj: హీరోయిన్లకే అసూయ పుట్టించే అందం... మిథాలీ రాజ్ సొంతం
భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ తన అందంతో హీరోయిన్లకే పోటీగా నిలుస్తోంది. క్రికెట్లో ఫ్యాషన్ క్వీన్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App38 ఏళ్ల మిథాలీ రైట్ హ్యాండ్ బ్యాట్స్ ఉమెన్. రెండుసార్లు ప్రపంచకప్‌లో భారత జట్టుకు కెప్టెన్గాా వ్యవహరించిన తొలి క్రికెటర్.
రెండు దశాబ్దాలకు పైగా ఆమె అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగుతోంది. 2019లో 36 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మిథాలీ అంతర్జాతీయ వన్డే క్రికెటర్లో రెండు దశాబ్దాలు ఆడిన తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పింది.
ఇంటర్నేషనల్ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్‌గా ఘనత సాధించింది మిథాలీ రాజ్.
ICC ప్రకటించే అంతర్జాతీయ వన్డే ర్యాంకింగ్స్‌లో మిథాలీ రాజ్ 2005లో తొలిసారి నెం.1 స్థానంలో నిలిచింది.
క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్ తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ‘శభాష్ మీతూ’ అని పేరు ఖరారు చేశారు. ఇందులో మిథాలీ రాజ్ పాత్రను తాప్సి పోషిస్తుంది.
1999లో తొలిసారిగా అంతర్జాతీయ వన్డే క్రికెట్ లో ప్రవేశించి ఐర్లాండ్ పై 114 పరుగులు సాధించి నాటౌట్ గా నిల్చింది.
భారత క్రీడారంగంలో అత్యున్నతమైన అర్జున అవార్డును 2003లొ మిథాలిరాజ్ అందుకుంది.
10 ఏళ్ల వయస్సులో క్రికెట్ ఆడటం మొదలుపెట్టిన మిథాలీ 13 ఏళ్లకే ప్రొఫెషనల్‌గా మారింది.
మిథాలీ చిన్నతనంలో భరత నాట్యం నేర్చుకుంది. పలు స్టేజ్ షోలు కూడా చేసింది.
స్వతహాగా బ్యాటింగ్ చేసే మిథాలి అప్పుడప్పుడు బౌలింగ్ కూడా వేస్తుంది.
19 ఏళ్ల వయస్సులో ఇంగ్లాండ్ పై 214 చేసిన మూమెంట్ తన లైఫ్‌లో మోస్ట్ మెమరబుల్ అని చెప్తోంది మిథాలీ రాజ్.
19 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టింది మిథాలీ. తన తొలి వన్డే మ్యాచ్‌ని ఐర్లాండ్ పై ఆడింది. ఈ మ్యాచ్‌లో ఆమె 114 పరుగులతో అజేయంగా నిలిచింది.
ఇప్పటి వరకు మిథాలీ రాజ్ అంతర్జాతీయ క్రికెట్లో 8 సెంచరీలు, 79 హాఫ్ సెంచరీలు చేసింది.
భారత్ తరఫున 140 మ్యాచ్‌లకు మిథాలీ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహించింది. మహిళా క్రికెట్లో అత్యధిక మ్యాచ్‌లకు సారథిగా వ్యవహరించిన తొలి క్రికెటర్ మిథాలీ రాజ్.
అంతర్జాతీయ వన్డే క్రికెట్లో వరుసగా 7 మ్యాచుల్లో 7 హాఫ్ సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్ మిథాలీ రాజ్.
అంతర్జాతీయ మహిళల వన్డే క్రికెట్లో అత్యధికంగా 90 ఆపై స్కోర్లు సాధించిన క్రికెటర్ మిథాలీనే. ఆమె 5 సార్లు 90 మార్కును అందుకుంది.
డిసెంబరు 3, 1982లో జన్మించిన మిథాలీ... తన పుట్టిన రోజు తారీఖునే జెర్సీ నంబర్‌గా మార్చుకుంది. ఆమె జెర్సీ నంబర్ 3.
టెస్టుల్లో 214, వన్డేల్లో 125(నాటౌట్), టీ20ల్లో 97(నాటౌట్) మిథాలీ రాజ్ అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక స్కోర్లు.