Tollywood Celebrities Update : టాలీవుడ్ స్టార్లు.. అదిరిపోయే స్పోర్ట్స్ ప్లేయర్లు!
ఇండస్ట్రీలో రాణించడం కోసం మన తారలు యాక్టింగ్ స్కూల్స్ కోసం, మోడెలింగ్ సెషన్స్ కోసం చాలా ఖర్చు పెట్టి ఉంటారని మనం అనుకుంటూ ఉంటాం. కానీ నిజానికి మొదట్లో వాళ్లకు అసలు నటించాలనే ఆలోచనే ఉండేది కాదట. మంచి స్పోర్ట్స్ ప్లేయర్స్ గా గుర్తింపు తెచ్చుకోవాలని ఆరాటపడేవారు. అలా స్పోర్ట్స్ లో కెరీర్ మొదలుపెట్టి నటులుగా మారిన వారెవరో ఇప్పుడు చూద్దాం!
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅవసరాల శ్రీనివాస్ : నటుడిగా, దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అవసరాల ప్రొఫెషనల్ రాకెట్ బాల్ ప్లేయర్. 2014లో జరిగిన సౌత్ కొరియా ఏషియన్ ఓపెన్ రాకెట్ బాల్ ఛాంపియన్ షిప్ లో పాల్గొన్నారు. అంతేకాదు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫ్ రాకెట్ బాల్ అసోసియేషన్ మెంబర్ గా ఉన్నారు.
అక్కినేని అఖిల్ : టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ క్రికెట్ బాగా ఆడతాడు. 2010లో సీసీఎల్ లో అఖిల్ ఆటతీరుని చూసినవారెవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. అప్పటికి అఖిల్ వయసు 17 మాత్రమే. 2015లో కెప్టెన్ ఆఫ్ ది తెలుగు వారియర్స్ అయ్యాడు. రెండేళ్లపాటు అఖిల్ క్రికెట్ లో శిక్షణ తీసుకున్నాడు.
రితికా సింగ్ : 'గురు' సినిమాతో తెలుగు వారికి దగ్గరైన రితికా.. నిజజీవితంలో మంచి బాక్సర్. అంతేకాదు.. మార్షల్ ఆర్ట్స్ లో కూడా ఎక్స్పర్ట్.
నాగశౌర్య : సినిమాల్లోకి హీరోగా రాకముందు శౌర్య నేషనల్ లెవెల్ టెన్నిస్ ప్లేయర్. తనకు తెలుగులో బ్రేక్ వచ్చే వరకు టెన్నిస్ ఆడుతూనే ఉండేవారు.
సుధీర్ బాబు : ఈ నటుడు నేషనల్ లెవెల్ బ్యాడ్మింటన్ ప్లేయర్. అంతేకాదు.. మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్నారు. ఇప్పుడు ఆయన పుల్లెల గోపీచంద్ బయోపిక్ లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
రామ్ చరణ్: మన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కి క్రికెట్ అంటే చాలా ఇష్టం. మొదట్లో క్రికెటర్ అవుదామనే అనుకున్నాడు. కానీ డెస్టినీ అతడిని నటుడ్ని చేసింది. గతంలో సీసీఎల్(సెలెబ్రిటీ క్రికెట్ లీగ్)కి ఆది క్రికెట్ పై తన ఇష్టాన్ని చాటుకున్నాడు.
రకుల్ ప్రీత్ సింగ్ : టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న రకుల్ నేషనల్ లెవెల్ గోల్ఫ్ ప్లేయర్. తనకు సమయం దొరికిన ప్రతీసారి గోల్ఫ్ ఆడుతూనే ఉంటుంది. అలానే ఆమెకి ఫిట్నెస్ అంటే పిచ్చి. రెండు తెలుగు రాష్ట్రాలలో సొంతంగా జిమ్స్ కోసం ఓపెన్ చేసింది.
అజిత్ కుమార్ : కోలీవుడ్ లో స్టార్ హీరోగా దూసుకుపోతున్న అజిత్ కి బైక్ రేసింగ్ అంటే చాలా ఇష్టం. మొన్నామధ్య హైదరాబాద్ లో షూటింగ్ ఉంటే చెన్నై నుండి హైదరాబాద్ కి బైక్ మీద వచ్చేశారు. 2010లో జరిగిన ఎంఆర్ఎఫ్ రేసింగ్ సిరీస్ లో పాల్గొన్నారు అజిత్.