Laknavaram Lake Photos: ఫారిన్ ట్రిప్ వెళ్లలేకపోతున్నారా? మంచి టూరిజం స్పాట్ అందాల లక్నవరం లేక్ ప్లాన్ చేయండి
ఈ ఫొటో చూసి ఈ పర్యాటక స్థలం ఎక్కడో విదేశాలలో ఉందనుకుంటున్నారా! కాదండీ ఇది మన తెలుగువారి టూరిస్ట్ స్పాట్. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందామా.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని బుస్సాపూర్ గ్రామం సమీపంలో లక్నవరం సరస్సు ఉంది. ఈ ప్రకృతి అందాల లక్నవరంలో మరో ఆకర్షణ వచ్చి చేరింది. ఐలాండ్ టూరిజం అందుబాటులోకి వచ్చింది.
చుట్టూ దట్టమైన అడవి, పచ్చటి కొండలు వాటి మధ్యలో పెద్ద జలాశయం అదే మన లక్నవరం చెరువు. అక్కడి ద్వీపంలో బస అని ఊహించుకుంటేనే ఎంత అందంగా ఉంది. అదే జరిగితే అచ్చం మన లక్నవరంలా ఉంటుంది.
లక్నవరం చెరువు వద్ద అద్భుతమైన సౌకర్యాలతో వసతి, వాటర్ అండ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ సైతం ఉన్నాయి. వాటితోపాటు రుచికరమైన భోజనం దొరుకుతుంది. టూరిస్ట్ స్పాట్ లక్నవరం చెరువుకు చేరుకోవటం చాలా సులువు.
హైదరాబాద్ కు దాదాపు 150 కిలో మీటర్ల దూరం, వరంగల్ నుంచి 75 కిలోమీటర్ల దూరంలో గోవిందరావుపేట మండలంలోని లక్నవరం చెరువు కలదు. తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఫ్రీకౌట్స్ సంస్థ లీజు పద్దతిలో రిసార్టును డెవలప్ చేసి ది కోవ్ పేరుతో అందుబాటులోకి తెచ్చారు.
కేరళ, లక్షద్వీప్, బాలీ లాంటి పర్యాటక ప్రాంతాలలో అందమైన ప్రకృతికి చుట్టూ నీళ్లు తోడవుతాయి. బోటు షికారు అక్కడ ప్రత్యేకం. సరిగ్గా అవే సౌకర్యాలతో ములుగు జిల్లా లక్నవరంలో 22 ప్రీమియం రూములతో మూడో రిసార్ట్స్ సిద్ధమైంది. అటాచ్డ్ స్విమ్మింగ్ పూల్స్, కామన్ పూల్, జిప్ లైన్ లాంటి అడ్వంచర్ గేమ్స్, వాటర్ స్పోర్ట్స్ ను ఆస్వాదించవచ్చు.
డెస్టినేషన్ వెడ్డింగ్, పార్టీలు, ప్రీ వెడ్డింగ్ షూట్ లకు ఈ లక్నవరం రిసార్ట్స్ ప్రత్యేక ఆకర్షణగా మారుతోంది. కనుక పర్యాటకులు లక్నవరం చెరువును సందర్శించి అక్కడి వాతావరణాన్ని ఆస్వాదించాలంటే ముందుగానే బుకింగ్ ఏర్పాట్లు చూసుకోవాలి. బుకింగ్ వివరాల మరింత సమాచారం జనరల్ మేనేజర్ జాన్ 9700006049, మేనేజర్ జితేందర్ 9000912221 నెంబర్లలో సంప్రదించవచ్చు.