ABP Southern Rising Summit 2024 Gautami: ప్రతి మహిళకు ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యం!
క్యాన్సర్ బారిన పడేసరికి నేను సింగిల్ పేరెంట్.. ఏం చేయాలో అర్థంకాలేదు..ఆ క్షణం కేవలం నా కూతురి గురించి మాత్రమే ఆలోచించాను. నేను లేకపోతే తన పరిస్థితి ఏంటి అనే ఆలోచనే నన్ను క్యాన్సర్ ని జయించేలా చేసిందని ఏబీపీ సదర్ రైజింగ్ సమ్మిట్ లో చెప్పారు గౌతమి..
Download ABP Live App and Watch All Latest Videos
View In Appశారీరికంగా, మానసికంగా చాలా వీక్ ఉన్నాను..కానీ చిన్నతనంలో తల్లిదండ్రులు లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాక తెలుసు.. ఆ పరిస్థితి నా కూతురికి రాకూడదని భావించా..
నరకం అని తెలిసినా కానీ క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం ముందుకొచ్చాను..బాధను భరించేందుకు మానసికంగా స్ట్రాంగ్ అవ్వాలి అనుకున్నాను. నన్ను నేను ప్రిపేర్ చేసుకున్నాను అన్నారు గౌతమి
ఈ రోజు క్యాన్సర్ ని జయించి మీముందు ఉన్నానంటే కారణం.. మానసిక ధైర్యమే. ప్రతి మహిళకు ఆరోగ్యంతో పాటూ మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం అన్నారు గౌతమి
మానసికంగా స్ట్రాంగ్ గా ఉంటే చాలు..ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కోవచ్చన్నారు గౌతమి