In Pics: జెండా ఎగరేసిన రేవంత్.. ర్యాలీగా కాలినడకన గాంధీ భవన్‌కు కాంగ్రెస్ నేతలు
75వ స్వాతంత్ర వేడుకలు గాంధీ భవన్లో ఘనంగా జరిగాయి.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appత్రివర్ణ పతాక ఆవిష్కరణకు ముందు తెలంగాణ కాంగ్రెస్ నేతలు అబిడ్స్‌లోని పండిట్ జవాహార్లాల్ నెహ్రు విగ్రహానికి నివాళులర్పించారు.
అక్కడి నుండి ర్యాలీగా జాతీయ జెండాలను చేతపట్టుకొని గాంధీ భవన్‌కు చేరుకున్నారు.
అనంతరం తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క జాతీయ జెండాను గాంధీ భవన్లో ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాస్కి గౌడ్, బోస్ రాజ్, పొన్నాల లక్ష్మయ్య, మహేష్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి గీతా రెడ్డి, దాసోజు శ్రవణ్, పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలకు కాంగ్రెస్ నేతల త్యాగాలే కారణమని అన్నారు.
‘‘రైతులు మొక్కవోని దీక్షతో 9 నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో పోరాటం చేస్తున్నారు. ఇక్కడ కేసీఆర్ కొరివి దెయ్యంలా ప్రాజెక్టుల పేరుతో, అభివృద్ధి కార్యక్రమాలు పేరుతో దళిత గిరిజన భూములను లాక్కొని బజారులో నిలబెట్టాడు’’ అని రేవంత్ వ్యాఖ్యలు చేశారు.
‘‘దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది. అఖండ భారత్‌గా నిలబెట్టే శక్తి ఒక్క కాంగ్రెస్‌కే ఉంది. రాహుల్ గాంధీ ఆలోచనలతో ప్రపంచ దేశాల ముందు భారత్‌ను ఒక శక్తిగా నిలుపుదాం’’ అని రేవంత్ పిలుపునిచ్చారు.