In Pics: చూపుతిప్పుకోనివ్వని చార్మినార్, మూడు రంగుల లైట్లతో ముస్తాబు.. ఇలా ఎప్పుడూ చూసుండరు!
స్వాతంత్ర వేడుకలకు చార్మినార్ విద్యుత్ కాంతుల్లో ధగధగలాడుతోంది. త్రివర్ణ పతాకంలోని రంగులతో మెరిసిపోతోంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆగస్టు 15 సందర్భంగా చార్మినార్ను అధికారులు ఇలా రెడీ చేశారు. రాత్రివేళ చూపు తిప్పుకోనివ్వకుండా చార్మినార్ ఆకట్టుకుంటోంది.
విద్యుత్ కాంతుల్లో చార్మినార్ను చూసేందుకు పెద్ద ఎత్తున జనం వస్తున్నారు. రాత్రివేళ చార్మినార్ చుట్టుపక్కల తెగ ఫోటోలు దిగుతున్నారు.
ఇక 75వ స్వాతంత్ర్య దినోత్సవానికి గోల్కొండ కోట ముస్తాబయింది. ఉదయం 10.30 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ త్రివర్ణ పతాకాన్ని గోల్కొండ వేదికగా ఎగరవేయనున్నారు.
స్వాతంత్ర వేడుకల్లో పాల్గొనే ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వద్ద సైనిక వీరుల స్మారకం వద్ద అమరులకు నివాళులు అర్పిస్తారు. అక్కడి నుంచి గోల్కొండ కోటకు చేరుకుంటారు.