In Pics: మబ్బుల మాటు నుంచి రంగనాయక సాగర్‌ను చూడండి.. ఎంత అందమో.. డ్రోన్ ఫోటోలు
తెలంగాణలో రిజర్వాయర్లన్నీ నిండు కుండను తలపిస్తున్నాయి. గోదావరి నీళ్లతో సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్ జలాశయం నిండుగా కనిపిస్తోంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రాజెక్టు చుట్టూ పచ్చదనం, నడి మధ్యలో చిన్న దీవి, అక్కడికి వెళ్లేందుకు సన్నటి దారి.. వెరసి ఈ ప్రాంతం పర్యటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆర్థిక మంత్రి హరీశ్ రావు హెలికాప్టర్‌లో ప్రయాణిస్తూ ఈ అద్భుతమైన దృశ్యాన్ని తిలకించారు. వీటికి సంబంధించిన ఫోటోలను హరీశ్‌రావు ట్వీట్ చేశారు.
రంగనాయక సాగర్ ప్రాజెక్టు సిద్దిపేట జిల్లాలో చంద్లాపూర్ వద్ద ఉంది. సామర్థ్యం 3 టీఎంసీలు. 2,300 ఎకరాల్లో రూ.3,300 కోట్ల ఖర్చుతో ఈ రంగనాయక సాగర్ ప్రాజెక్టును నిర్మించారు.
సిద్దిపేట పట్టణానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అతి పెద్దదైన బాహుబలి మోటారు ఇక్కడి పంప్ హౌస్‌లోనే ఏర్పాటు చేశారు.
దీని సామర్థ్యం 139.5 మెగావాట్లు. ప్రపంచంలోనే అతిపెద్ద సామర్థ్యం ఉన్న మోటారుగా దీన్ని పరిగణిస్తుంటారు.