1906లో మన జాతీయ జెండా ఎలా ఉండేదో తెలుసా? చూస్తే.. ఆశ్చర్యపోతారు!
1947లో మన జాతీయ జెండా రూపకల్పనకు ముందు అనేక జెండాలను రూపొందించారు. 1906 నుంచి 1947 వరకు మన జాతీయ జెండాల్లో చేసిన మార్పులేమిటో తెలుసుకుందామా!
Download ABP Live App and Watch All Latest Videos
View In App1906లో కలకత్తా జెండా: సచింద్ర ప్రసాద్, బోస్ సుకుమార్ మిత్రాలు తయారు చేసిన పతాకాన్ని.. తొలి అనధికారిక జెండాగా భావిస్తారు. దీన్ని తొలిసారిగా కోల్‌కతాలోని పార్శి బేగన్ స్క్వేర్ వద్ద ఎగురవేశారు.
1907లో మేడం బికాజీ రుస్తుం కామా జెండా: మేడం బికాజీ కామా, వీర్ సవార్కర్, శ్యామ్‌జీ కృష్ణ వర్మ సంయుక్తంగా రూపొందించిన జెండా ఇది. ఈ జెండాను 1907లో జర్మనీలోని స్టట్గార్ట్‌లో జెండాను ఆవిష్కరించారు. ఇదే కొన్నాళ్లు జాతీయ జెండాగా చెలామణి అయ్యింది.
1917లో సప్తరుషి జెండా: 1917లో ‘హోమ్ రూల్’ ఉద్యమం నేపథ్యంలో డాక్టర్ అని బిసెంట్, లోకమాన్య తిలక్‌లు ఈ జెండాను ఎగురవేశారు. ఇండియాకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించాలనేది ఈ ఉద్యమం ముఖ్య ఉద్దేశం.
1921లో ఉమ్మడి జెండా: జాతీయ జెండా యావత్ దేశానికి ప్రతీకగా ఉండాలనే ఉద్దేశంతో 1921లో ఈ జెండాను రూపొందించారు. ఇందులోని తెలుపు మైనారిటీలు, పచ్చ రంగు ముస్లింలు, ఎర్ర రంగు హిందువులను సూచిస్తుంది. ఈ రంగులను కలుపుతూ మధ్యలో రాట్నం ఉంటుంది.
1931లో కాంగ్రెస్ జెండా: మధ్యలో తెలుపు, పైన కాషాయం, కింద పచ్చ రంగు.. వాటి మధ్యలో రాట్నంతో పింగలి వెంకయ్య కాంగ్రెస్ అధికారిక జెండాను రూపొందించారు. ఇది అందరి ఆమోదం పొందింది.
1947లో జాతీయ జెండా: 1937లో పింగలి వెంకయ్య తయారు చేసిన జెండాలోనే స్వల్ప మార్పులు చేసి జాతీయ పతాకాన్ని తయారు చేశారు. మధ్యలో రాట్నానికి బదులు అశోక చక్రాన్ని ఏర్పాటు చేశారు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షన ఏర్పాటైన కమిటీ ఈ జాతీయ జెండాకు ఆమోదం తెలిపింది. అప్పటి నుంచి ఈ జెండానే మన జాతీయ జెండాగా రెపరెపలాడుతోంది.