Savitribai Phule Jayanti: భారత్లో తొలి మహిళా టీచర్ సావిత్రిబాయి పూలేకు సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళి
ఆధునిక భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు, సామాజిక సంస్కర్త సావిత్రిబాయి పూలేకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళులర్పించారు. సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా జూబ్లిహిల్స్ లోని తన నివాసంలో ఆమె చిత్రపటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుష్పాంజలి ఘటించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి, తెలంగాణ సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, తదితరులు సావిత్రీబాయి పూలే చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఆమె స్ఫూర్తిని మనం కొనసాగించాలని పిలుపునిచ్చారు.
సావిత్రిబాయి పూలే మహిళలు చదువుకోవాలని నినదించి, సమాజంలో మేం సగం అని ఎదగడానికి కారకులయ్యారు. ఆమె జయంతిని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించింది. మహిళా ఉపాధ్యాయ దినోత్సవంతో పాటు ప్రభుత్వం పక్షాన గౌరవించుకొని సాయిత్రిబాయి పూలే జయంతిని తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నాం. ఆమె మార్గదర్శకత్వంలో ప్రపంచంలో అన్ని రంగాల్లో భారత మహిళలు పోటీ పడేలా ఎదగాలని ఆకాంక్ష.
తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇస్తుంది. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, త్వరలో ఇందిరమ్మ ఇళ్లు, మహిళా సంఘాల పటిష్టం చేస్తాం. చెప్పినట్లుగానే కోటి మంది మహిళలకు కోటీశ్వరులు చేయడం కాంగ్రె ప్రభుత్వం లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.