In Pics: అడుగడుగునా కేసీఆర్, అంబేడ్కర్ కటౌట్లు.. కానీ, ఈ ఫ్లెక్సీ పొరపాటా లేక.. అసలేం జరిగిందో..!
తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ మరో ప్రతిష్ఠాత్మక పథకాన్ని ఇవాళ ప్రారంభించనున్న వేళ.. భారీ సభ జరిగే హుజూరాబాద్ నియోజకవర్గంలోని శాలపల్లి సందడిగా మారింది. సభకు వెళ్లే మార్గాలన్నీ గులాబీ మయం అయ్యాయి.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకేసీఆర్, అంబేడ్కర్ చిత్ర పటాలతో ఎత్తైన భారీ కటౌట్లు, ఫ్లెక్సీలను రోడ్ల పక్కన ఏర్పాటు చేశారు. వాటిపై కేసీఆర్ను ‘దళిత బాంధవుడు’ అని కీర్తిస్తూ రాశారు. సాధారణంగా పార్టీ వర్గాలు, కార్యకర్తలు తమ నాయుడ్ని కీర్తించుకుంటూ ఇలా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయించడం మామూలే.
కానీ, ఇక్కడ ఆశ్చర్యకర విషయం ఏంటంటే.. ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించింది.. జిల్లా కలెక్టర్ అని అర్థం వచ్చేలా ఉంది. కటౌట్ లేదా ఫ్లెక్సీ చివర్లో ‘‘కలెక్టర్, కరీంనగర్ జిల్లా’’ అని ఉంది. పార్టీ నేతలు, కార్యకర్తల మాదిరిగా ఏకంగా జిల్లా కలెక్టర్ ఇలా నాయకుడ్ని కీర్తిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించడం ఏంటని పలువురు ఆశ్చర్యానికి గురవుతున్నారు. నిజంగా ఆ ఫ్లెక్సీలు, కటౌట్లను కలెక్టర్ ఏర్పాటు చేయించారా? లేక పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసి కలెక్టర్ అని పేరు వేయించారా? అనే దానిపై స్పష్టత లేదు.
మరోవైపు, దళిత బంధు సభ మధ్యాహ్నం రెండు గంటలకు జరగనుంది. ఒంటి గంటకు సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి బయలుదేరనున్నారు. 1.10 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా శాలపల్లి చేరుకుంటారు. సాయంత్రం 4 గంటల వరకూ సభలో పాల్గొంటారు. మళ్లీ వెంటనే అదే హెలికాప్టర్లో హైదరాబాద్కు తిరుగు ప్రయాణమై సాయంత్రం 5 గంటలకల్లా ప్రగతి భవన్ చేరుకుంటారు.