In Pics: టీనేజ్ దాటేసిన కేటీఆర్ కుమారుడు హిమాన్షు - కేసీఆర్ ఫాంహౌస్లో గ్రాండ్గా బర్త్ డే సెలబ్రేషన్స్
బీఆర్ఎస్ అధినేత, కేసీఆర్ మనుమడు, మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుమారుడు, కల్వకుంట్ల హిమాన్షు పుట్టినరోజు వేడుకలు ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసంలో ఘనంగా జరిగాయి.
Download ABP Live App and Watch All Latest Videos
View In App19 ఏండ్ల టీనేజ్ వయస్సును దాటిన మనుమడు హిమాన్షు ఇరవైలోకి ప్రవేశించిన ప్రత్యేక సందర్భంగా నాయనమ్మ శోభమ్మ ఇష్టంతో 19 కేజీల భారీ కేకును తయారు చేయించారు.
కుటుంబసభ్యులు, బంధుమిత్రులు సిబ్బంది నడుమ హిమాన్షు తన పుట్టినరోజు వేడుక జరిగింది.
భారీ కేకును కట్ చేసి తాతయ్య నాయనమ్మలకు కేకును తినిపించిన హిమాన్షు, వారి ఆశీర్వాదం తీసుకున్నారు.
శతమానం భవతి అంటూ తమ గారాల మనవడిని కేసీఆర్ దంపతులు దీవించారు.
అనంతరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపుమేరకు తన పుట్టినరోజును పురస్కరించుకుని ఎర్రవెల్లి నివాసం ఆవరణలో హిమాన్షు మొక్కను నాటారు.
ఈ సందర్భంగా హిమాన్షు తల్లి, కేటీఆర్ సతీమణి శైలిమ, అమ్మమ్మ శశికళ, వినోదమ్మ, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, తదితర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
వారి ఫాం హౌస్ ఆవరణలోనే హిమన్షు మామిడి మొక్కను నాటాడు