Anant-Radhika Wedding: అనంత్ అంబానీ ఫంక్షన్‌కి శ్లోకా మెహతా ఎలా రెడీ అయిందో చూద్దామా?
అనంత్ అంబానీ మరియు రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్లో అంబానీ కుటుంబం యొక్క పెద్ద కోడలు శ్లోకా మెహతా లుక్ అదిరిపోయింది.అయితే ఈ క్రెడిట్ శ్లోక సోదరి దియా మెహతాకే చెందుతుంది. దియా చాలా మంది డిజైనర్ల నుండి దుస్తులను ఎంచుకుని, తన సోదరి శ్లోక కోసం వాటిని స్టైల్ చేసిందట.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅనంత్ , రాధిక మర్చంట్ కోసం యాంటిలియాలో ఏర్పాటు చేసిన శివశక్తి పూజలో పెద్ద కోడలు శ్లోకా మెహతా గోల్డెన్ కలర్ చీర కట్టుకుంది. ఈ లుక్‌లో ఆమె ఒక బాలీవుడ్ ఎ నటిలా కనిపించింది.
శ్లోకా కట్టుకున్న చీర టిష్యూ మెటీరీయల్ మీద అద్భుతమైన వర్క్ చేయబడి సాంప్రదాయానికి ఆధునికత జోడించినట్టుగా ఉంది.
శ్లోకా ఈ బంగారు చీరకి హాఫ్ స్లీవ్ బ్లౌజ్ వేసుకుంది అంతే కాకుండా, పిస్తా గ్రీన్ కలర్ దుపట్టా కూడా ధరించింది. అంబానీ పెద్ద కోడలు ఈ లుక్‌లో పూర్తిగా రాయల్‌గా కనిపించింది.
ఆభరణాల విషయానికి వస్తే శ్లోక తన అమ్మమ్మ బంగారు హారాన్ని ధరించింది. అలాగే మ్యాచింగ్ చెవిపోగులు, మాంగ్ టిక్కా కూడా ధరించి అందంగా కనిపించింది. అలాగే గ్లోయింగ్ న్యూడ్ మేకప్ వేసుకుంది. శ్లోక ఈ చిత్రాలలో అద్భుతంగా కనపడుతుండటంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.