Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
KCR Visits Kondagattu Temple: కొండగట్టు అంజన్న ఆలయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు, అనంతరం సమీక్ష
భారతదేశంలోనే గొప్పదైన ఆంజనేయ స్వామి దేవాలయం ఎక్కడున్నదంటే కొండగట్టు అంజన్న ఆలయం పేరు వినపడేలా అత్యంత గొప్పగా, అన్ని హంగులతో, సకల సౌకర్యాలతో తీర్చిదిద్దాలని అధికారులను తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకొండగట్టు ఆంజన్న ఆలయాన్ని ఆగమశాస్త్ర పద్ధతులను అనుసరించి అభివృద్ధి చేయాలని, భక్తుల సౌకర్యార్థం పునర్నిర్మాణాలను చేపట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
కొండగటట్టు ఆలయాన్ని సుందరంగా తీర్చి దిద్ది, దేశవ్యాప్తంగా ఉన్న హనుమాన్ భక్తులు దర్శించుకునేందుకు అనువుగా కార్యాచరణ రూపొందిచేలా బుధవారం నాడు కొండగట్టు అంజన్న సన్నిధిలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాన్ని సీఎం కేసీఆర్ నిర్వహించారు.
కొండగట్టు అంజన్న స్థల పురాణం గురించి సీఎం కేసీఆరే స్వయంగా అధికారులకు వివరించారు.
కొండగట్టు అంజన్న ఆలయానికి ఫ్లడ్ ఫ్లో కెనాల్ నుంచి పైపుల ద్వారా నీటిని తరలించే పనులను చేపట్టాలని, కార్యదర్శి స్మితా సబర్వాల్, ఇరిగేషన్ అధికారులకు సిఎం కేసీఆర్ సూచించారు.
వైష్ణవ సాంప్రదాయాన్ని అనసరించి ఆలయ పునర్నిర్మాణానికి, అభివృద్ధిని చేపట్టనున్నట్లు స్పష్టం చేసిన సీఎం కేసీఆర్.
యాదగిరి గుట్ట ఆలయ నిర్మాణం సమయంలో చేపట్టిన సూక్ష్మ పరిశీలన, విస్తృతస్థాయి సమావేశాల మాదిరి అంజన్న ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధి పనులను కూడా చేపతడతామని స్పష్టం చేసిన సీఎం కేసీఆర్.
ఆగమ శాస్త్ర నియమాలను అనుసరించి గర్భాలయం మినహా ఆలయాన్ని విస్తరించాలని సీఎం ఆదేశించారు. ఆగమశాస్త్ర నియమాలను అనుసరించి మూలవిరాట్టును ముట్టుకోకుండా ఆలయ విస్తరణ సాగాలన్నారు.
వాస్తు నియమాల ప్రకారం ఏ నిర్మాణాన్ని ఎక్కడ చేపట్టాలో నిర్ణయించుకోవాలన్నారు. ఏటా లక్షలాది మంది దీక్షాపరులు దీక్ష చేపడతారని, వారికి అన్ని సౌకర్యాలతో కూడిన వసతులను ఏర్పాటు చేయాలన్న సీఎం.
దేవాలయాన్ని భక్తుల అవసరాలకు అనుగుణంగా విస్తరించడానికి సేకరించాల్సిన భూములు, సంబంధించిన అంశాల పై లొకేషన్ మ్యాపుతో పూర్తిగా పరిశీలించిన సీఎం కేసీఆర్
మంగళవారం, శని, ఆదివారాల్లో రద్దీ సమయాలతో పాటు, హనుమాన్ జయంతి, ఇతర పండుగల సందర్భాల్లో భక్తుల తాకిడీని తట్టుకునేలా నిర్మాణం చేపట్టాలని సూచించిన సీఎం.
ప్రస్తుతం వస్తున్న భక్తులతో పాటు, ఆలయ అభివృద్ధి తర్వాత పెరగనున్న రద్దీకి అనుగుణంగా సౌకర్యాలు అందించేలా నిర్మాణ పనులు చేపట్టాలని అధికారులకు స్పష్టం చేసిన సీఎం కేసీఆర్
క్యూలైన్ల నిర్మాణం, ఎంతమంది భక్తులు వచ్చినా ఇబ్బందులు కలగకుండా, రవాణా సౌకర్యాలు, విశాలమైన ప్రధాన ద్వారం ఏర్పాటు చేయాలని సూచన
రెండు నెలల్లో కొండగట్టు అంజన్న ఆలయానికి నీటి సప్లై జరిగేలా మిషన్ భగీరథ ఫ్లడ్ ఫ్లో కెనాల్ నుంచి నీటిని తరలించే పనులను తక్షణమే పనులు చేపట్టాలని సీఎం స్మితా సభర్వాల్, , ఇరిగేషన్ అధికారులకు సిఎం కేసీఆర్ సూచించారు. ఈ నీటితోనే నిర్మాణ పనులు మొదలైతాయన్నారు.
మొదటి మూలవిరాట్టును దర్శించుకన్న తర్వాత అమ్మవారిని, ఆ తర్వాత వేంకటేశ్వర స్వామిని, తర్వాత గుట్ట కింద భేతాళ స్వామి దర్శనం, రాములవారి పాదుకల దర్శనం సర్క్యూట్ ను అనుసరించి నిర్మాణాలు చేపట్టాలని సూచించారు.
స్థల పురాణం పుస్తకాలను ముద్రించాలని, రాస్ట్రంలోని అన్ని ఆలయాల స్థల పురాణ పుస్తకాలు ఉండేలా అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అధికారులకు సూచించారు.
గుట్ట మీద కాటేజీల నిర్మాణికి దాతలను ఆహ్వానించాలన్న సీఎం. ఇప్పటికే శ్వేత గ్రానైట్స్ వారు నిర్మించి కాటేజ్ విస్తరణలో పోతున్నందున దాన్ని తిరిగి నిర్మాస్తామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.