తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా గణతంత్య్ర దినోత్సవం
రాజ్‌భవన్‌లో జాతీయ జెండా ఎగరవేశారు గవర్నర్ తమిళిసై
74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో జాతీయ పతాకావిష్కరణ చేశారు. జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు.
74వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా చార్మినార్ దగ్గర డీఎస్‌పీ స్కూల్స్ నిర్వహించిన హెరిటేజ్ వాక్ (చార్మినార్ నుండి ఫలాక్ నుమా ప్యాలస్ వరకు) కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి మల్లారెడ్డి
విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు
మంగళగిరిలో జరిగిన గణతంత్య్ర వేడుకల్లో జనసేన అధినేత పవన్ పాల్గొన్నారు.
హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు అధ్యక్షుడు బండి సంజయ్
ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు హైదారాబాద్ లోని కోకాపేట్ లోని తన నివాస సముదాయం వద్ద జాతీయ జెండా ఆవిష్కరించారు.