Telangana: రాజ్ భవన్లో ఘనంగా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్
తెలంగాణలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంత్రులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. గవర్నర్ అధికారిక నివాసం రాజ్ భవన్లో 75వ ఇండిపెండెన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరాజ్ భవన్లోని చారిత్రక దర్బార్ హాల్లో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ త్రివర్ణ పతాకాన్ని ఆదివారం ఉదయం ఎగురవేశారు. అనంతరం ఆమె గౌరవ వందనం స్వీకరించారు.
రాష్ట్ర ప్రజలకు 75వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్ భవన్లో పనిచేసే సిబ్బందికి, అధికారులు, పోలీసులు, వ్యక్తిగత భద్రతా సిబ్బందికి, వారి పిల్లలకు స్వీట్లు పంచారు. పూజలు నిర్వహించిన అనంతరం పుదుచ్చేరికి తమిళిసై బయలుదేరారు.
తెలంగాణ అభివృద్ధి పథకంలో మరింత ముందుకు సాగాలని ఆమె ఆకాంక్షించారు. ఈ వేడుకలో గవర్నర్ తమిళిసై సలహాదారులు ఏపీవీఎన్ శర్మ, ఏకే మహంతి, కార్యదర్శి కె. సురేంద్ర మోహన్, ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.