YS Sharmila Hunger Strike: సిరిసిల్ల జిల్లాలో వైఎస్ షర్మిల నిరాహార దీక్ష.. ఆ ఫ్యామిలీకి పరామర్శ
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం కోనరావుపేట మండలం గొల్లపల్లె గ్రామంలో ఒక రోజు నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఉద్యోగం రాలేదనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న మహేందర్ యాదవ్ కుటుంబాన్ని పరామర్శించి అక్కడే నిరాహార దీక్ష చేశారు.
ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన గొల్లపల్లెకు చెందిన ముచ్చర్ల మహేందర్ యాదవ్ (29) కుటుంబాన్ని షర్మిల పరామర్శించనున్నట్లుగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధికార ప్రతినిధి సోమవారమే (ఆగస్టు 2) ప్రకటించారు.
సాయంత్రం 4 గంటలకు ఆమె దీక్ష విరమించనున్నారు. షర్మిల ఈ దీక్ష కోసం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము అన్ని ఏర్పాట్లు చేశారు.
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలో షబ్బీర్ అనే యువకుడు ఉద్యోగం రాలేదని ఆదివారం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై కూడా షర్మిల స్పందించారు.
నిరుద్యోగుల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని షర్మిల ఘాటుగా కామెంట్స్ చేశారు. ప్రభుత్వం భరోసా ఇవ్వకపోవడం వల్లే యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని షర్మిల ఆరోపించారు.
తొలి నుంచి తెలంగాణలో నిరుద్యోగంపై షర్మిల గళమెత్తుతూ వస్తున్నారు. నిరుద్యోగం వల్ల చనిపోయిన యువకుల కుటుంబాలను తరచూ పరామర్శిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ను తీవ్ర పదజాలంతో విమర్శిస్తూ వస్తున్నారు.