Vizag Steel Plant: ఢిల్లీలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మహాధర్నా... సంఘీభావం తెలిపిన వివిధ పార్టీలు
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కేంద్రానికి వ్యతిరేకంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉక్కు పరిరక్షణ సమితి నిరసన చేపట్టింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appస్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఢిల్లీలో కార్మికులు చేపట్టిన మహాధర్నాలో వైఎస్సార్ సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, ఎంవీవీ సత్యనారాయణ విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం కానివ్వబోమని స్పష్టంచేశారు
పార్టీలకు అతీతంగా పోరాటం చేసి స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకుందామని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. ఈ పోరాటంలో తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సంఘీభావం సంపూర్ణంగా ఉంటుందని తెలిపారు. ఉమ్మడిగా పోరాటం చేయడానికి తాను ముందు నిలబడతామని విజయసాయిరెడ్డి చెప్పారు.
ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద స్టీల్‌ప్లాంట్ కార్మికుల మహానిరసన కార్యక్రమానికి సీపీఎం నేతలు మద్దతు తెలిపారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా ఆందోళనలు చేపట్టారు