బిహార్ ఎన్నికలు 2025
(Source: ECI | ABP NEWS)
Miss World 2025 : మిస్ వరల్డ్ పోటీదారులకు చౌమొహల్లా ప్యాలెస్‌లో తెలంగాణ ప్రభుత్వం విందు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా నిర్వహిస్తున్న మిస్‌వరల్డ్ పోటీలు ఆసక్తిగా సాగుతున్నాయి.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appహైదరాబాద్ వేదికగా జరుగుతున్న మిస్ వరల్డ్-2025 పోటీదారులకు మంగళవారం (మే 13) విందు ఇచ్చింది.
హైదరాబాద్ ఐకానిక్ ప్లేస్ చౌమొహల్లా ప్యాలెస్‌లో ఈ విందు ఏర్పాట్లు చేశారు.
ఈ విందు కార్యక్రమంలో ముఖ్యమంత్రి, మంత్రులు వివిధ ప్రభుత్వాధికారులు పాల్గొన్నారు.
నాగార్జున సహా సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులు కూడా ఈ విందుకు హాజరయ్యారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి ఒక్కరి టేబుల్ వద్దకు వెళ్లి అందర్నీ ఆప్యాయంగా పలకరించారు.
ప్రపంచ సుందరీమణుల కోసం ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ విందుకు హాజరయ్యే ముందు సుందరీమణులంతా చార్మీనార్ వద్ద హెరిటేజ్ వాక్‌లో పాల్గొన్నారు.
చార్మీనార్ విజిట్‌కు వెళ్లిన ప్రపంచ సుందరీమణులు అక్కడ షాపింగ్ చేశారు.