Miss World 2025 : అందాల ముద్దుగుమ్మ, ఛార్మినార్‌కు వచ్చిందమ్మ- మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ హెరిటేజ్ వాక్
ప్రపంచ ప్రఖ్యాత చార్మినార్ వద్ద 109 దేశాల మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ సందడి చేశారు.
పాపులర్ అయిన మార్ఫా వాయిద్యాలతో స్థానికులు స్వాగతం పలికారు.
మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్‌కు స్వాగతం పలికిన కళాకారులు బృందం వారితో ఫొటోలు దిగారు.
అందాల రాయబారుల రాక చార్మినార్ పరిసరాలకు సరికొత్త శోభ తీసుకొచ్చింది.
చార్మినార్ వద్ద ప్రత్యేకంగా ఫోటోషూట్‌కు హాజరైన అందగత్తెలు
చార్మినార్ వేదిక నుంచి ప్రజలకు అభివాదం చేసిన అందగత్తెలు
చారిత్రాత్మక లాడ్ బజార్‌లో ఎంపిక చేసిన కొన్ని షాపుల్లో షాపింగ్ చేసిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు
ముత్యాలు, గాజులను ఆసక్తికరంగా పరిశీలించిన ప్రపంచ అందగత్తెల పోటీదారులు
సరకుల వివరాలు తెలుసుకుంటూ కొనుగోలు చేసిన కంటెస్టెంట్లు
స్థానిక వ్యాపారులతో ముచ్చటించి వారు అమ్మే వస్తువుల వివరాలు తెలుసుకున్న మిస్ వరల్డ్ సుందరీమణులు
స్థానికులతో మాట్లాడి వారికి సెల్ఫీలు ఇచ్చిన మిస్ వరల్డ్ సుందరీమణులు
అక్కడ అందాలను తమ ఫోన్‌లలో బంధించారు.
చార్మీనార్ అందాలు చూసి మైమరచిపోయిన అందలా భామలు
నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌లో ఘనంగా ఈ మిస్‌వరల్డ్ పోటీలు ప్రారంభమయ్యాయి.
నాలుగు రోజుల క్రితం ప్రారంభమైన పోటీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
పోటీల్లో భాగంగా తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తున్నారు.
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పర్యటించారు.
సోమవారం నాడు నాగార్జున సాగర్, బుద్ధభవన్ సందర్శించిన అందగత్తెలు
అక్కడి పర్యాటక ప్రాంతాలను సందర్శించి విశేషాలు తెలుసుకున్నారు.
ఈ హెరిటేజ్ వాక్‌లో భాగంగా మంగళవారం చార్మీనార్‌లో సందర్శించారు.