In Pics: తెలంగాణలో ఫస్ట్ ‘గే’ మ్యారేజ్.. మంగళ స్నానాలు, సంగీత్.. వేడుక మామూలుగా లేదు..!
తెలంగాణలో రికార్డు క్రియేట్ చేసే వివాహం జరిగింది. ఈ తరహా పెళ్లి తెలంగాణలోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోనే మొదటిది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఇది స్వలింగ సంపర్కుల పెళ్లి. ఇద్దరు మగవారు వివాహం చేసుకున్నారు. రెండు కుటుంబాలకు చెందిన బంధువుల సమక్షంలో ఓ రిసార్టులో అంగరంగ వైభవంగా ఈ ఇరువురు ఒకటయ్యారు.
మన దేశంలో అందులోనూ తెలంగాణలో ఇలాంటి స్వలింగ సంపర్కుల పెళ్లి తొలిసారిగా జరిగింది.
హైదరాబాద్ శివారులోని ఓ రిసార్టులో వీరి వివాహం వేడుకగా జరిగింది.
ఇద్దరు పురుషులు ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. తెలంగాణలో పెళ్లి చేసుకున్న మొదటి గే జంటగా వీరు రికార్డు సృష్టించారు.
మొదటిసారిగా తెలంగాణలో ఇద్దరు పురుషులు ఇలా పెళ్లి చేసుకొని ఒకటయ్యారు.
8 ఏళ్ల క్రితం డేటింగ్ యాప్ ద్వారా వీరు పరిచయం అయ్యారు.
ఇలా సుప్రియో, అభయ్ అనే వ్యక్తుల స్నేహం ప్రేమగా మారి.. తాజాగా పెళ్లికి దారి తీసింది.
సుప్రియో హైదరాబాద్‌లో హోటల్ మెనేజ్మెంట్ స్కూల్లో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. అభయ్ ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో డెవలపర్‌గా పనిచేస్తున్నాడు.
వీరి వివాహ వేడుక సంప్రదాయబద్ధంగా మంగళస్నానాలు, సంగీత్ వంటి కార్యక్రమాలతో సాగింది.
హైదరాబాద్ శివారు వికారాబాద్ హైవేలోని ట్రాన్స్ గ్రీన్‌ఫీల్డ్ రిసార్ట్‌లో శనివారం జరిగిన తెలంగాణ తొలి స్వలింగ సంపర్కుల వివాహ వేడుక కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల సమక్షంలో అంగరంగ వైభంగా జరిగింది.
అందరి సమక్షంలో సుప్రియో, అభయ్ లు ఒక్కటయ్యారు. వీరి ప్రేమకు పెద్దలు కూడా అంగీకారం తెలిపారు.
డిసెంబరులో వివాహం చేసుకుంటామని సుప్రియో అభయ్ జంట గత అక్టోబరులోనే ఓ ప్రకటనలో తెలిపారు.
తమ వివాహనికి కుటుంబ సభ్యులను ఒప్పించడానికి ఎన్నో సంవత్సరాలు పట్టిందని సుప్రియో తెలిపారు.