Telangana Decade Celebrations: ట్యాంక్ బండ్‌పై తెలంగాణ అవతరణ దశాబ్ది వేడుకలు, ప్రత్యేక ఆకర్షణగా లేజర్ షో

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నేటి (జూన్ 2)తో పదేళ్లు పూర్తి అయింది. ఈ ఏడాది దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్రంలో తొలిసారి ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
తెలంగాణను ఇచ్చిన పార్టీ అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ నేతలు.. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత జరుగుతున్న తొలి రాష్ట్ర అవతరణ ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తోంది.

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో పాటు, తెలంగాణ ఉద్యమసారథి, మాజీ సీఎం కేసీఆర్ సహా పలువురు ప్రముఖులు, ఉద్యమకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానాలను పంపించింది.
తెలంగాణ రాష్ట్ర అవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ట్యాంక్‌బండ్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన సంబురాలు అంబరాన్నంటాయి.
తెలంగాణ దశాబ్ది వేడుకలకు విశిష్ట అతిథిగా రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ తో పాటు సీఎం రేవంత్‌రెడ్డి, పలువురు రాష్ట్రమంత్రులు, సీఎస్ శాంతి కుమారి హాజరయ్యారు.
ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను గవర్నర్ రాధాకృష్ణన్, సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. రాష్ట్రంలోని నలుమూలల నుంచి తరలివచ్చిన కళాకారులు ఈ వేడుకల్లో పాల్గొని తెలంగాణ చరిత్ర, సంస్కృతిని చాటిచెప్పేలా 17 రకాల కళలను ప్రదర్శించారు.
రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల కార్యక్రమాలను వీక్షించేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో ట్యాంక్‌బండ్ పరిసరాలు జనసంద్రంగా మారిపోయాయి.
ఈ వేడుకలు జరుగుతున్న సమయంలో కొంతసేపు వర్షం కురిసింది. దాంతో సాంస్కృతిక కార్యక్రమాలకు కొద్దిసేపు ఆటంకం ఏర్పడింది.
రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన కళాకారుల తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కళ్లకు కట్టేలా ప్రదర్శించి ఆకట్టుకున్నారు.
image 10
కార్నివాల్, లేజర్ షో, ఫుడ్, గేమింగ్ స్టాల్స్ కార్యక్రమానికి హాజరైన వారిని ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో భాగంగా లేజర్ షోను అద్భుతంగా నిర్వహించారు.