Siddharth - Aditi rao Hydari: పెళ్లికి ముందే హనీమూన్ వెళ్లిన సిద్ధార్థ్, అదితి - ఎక్కడికి వెళ్లారో తెలుసా? ఫోటోలు వైరల్
Siddharth and Aditi rao Hydari in Vacation: హీరో సిద్ధార్థ్, అతిథి రావు ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. కొంతకాలంగా సీక్రెట్ డేటింగ్లో ఉన్న ఈ లవ్‌బర్డ్స్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ విషయం తెలిసి ఈ జంట ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇక పెళ్లి కబురు ఎప్పుడు చెబుతారా? అంతా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో పెళ్లికి ముందే హనీమూన్‌కి వెళ్లి షాకిచ్చారు ఈ స్టార్ కపుల్.
తాజాగా ఈ వారు తమ వెకేషన్ ఫోటోలను షేర్ చేశారు. ఈ జంట ఇటలీ దేశంలోని టస్కనీకి వెకేషన్ కి వెళ్లినట్టు తెలుస్తోంది. అక్కడ ప్రకృతి అందాలను ఎంజాయ్ చేస్తూ క్లోజ్‌గా దిగిన ఫోటోలను తమ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
హనీమూన్‌కి వెళ్లారంటూ వస్తున్న వార్తలకు ఈ జంట ఈ ఫోటోలతో సైలెంట్‌గా సమాధానం ఇచ్చింది. డేటింగ్ టైంలో వేరువేరుగా వెకేషన్ వెడుతూ గొప్యత పాటించింది ఈ జంట.
ఇక ఇప్పుడు సిద్ధార్థ్, అదితిలు జంటగా దిగిన ఫోటోలు షేర్ చేస్తుండటంతో ఫ్యాన్స్ అంతా వీరిని చూసి మురిసిపోతున్నారు. ఈ ఫోటోలకు మేడ్ ఫర్ ఈజ్ అదర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
కాగా గత మార్చిలో సిద్దార్థ్, అదితిలో వనపర్తిలోని ఓ ప్రముఖ దేవాలయంలో చాలా సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకున్నారు.ఈ వేడుకను మీడియాను కూడా అలో చేయకపోవడంతో మొదట పెళ్లి అనుకున్నారు.
ఇద్దరు పెళ్లి చేసుకున్నారంటూ వార్తలు గుప్పుమనడంతో నిశ్చితార్థం చేసుకున్నామంటూ రింగ్‌లు తొడుక్కున్న ఫోటోలు షేర్ చేసి క్లారిటీ ఇచ్చారు.
పెద్దల సమక్షంలోనే వీరి పెళ్లి జరిగిందని, ఇక సంప్రదాయం బద్దంగా ఇరుకుటుంబ సభ్యుల సమక్షంలో తమ పెళ్లి జరుగుతుందని సిద్ధార్థ్ ఓ ఇంటర్య్వూలో వెల్లడించాడు.