Revanth Reddy in Film City: రామోజీరావు కుటుంబ సభ్యులను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నగరంలోని రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లారు. రామోజీరావు కుటుంబ సభ్యులను రేవంత్ రెడ్డి పరామర్శించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సీఎం రేవంత్ వెంట మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మల్ రెడ్డి రాంరెడ్డి, మధుసుధన్ రెడ్డి ఉన్నారు.
రామోజీరావు మరణం మీడియాకు, సినీ పరిశ్రమకు తీరని లోటు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రామోజీరావు సేవల్ని గుర్తు చేసుకున్నారు.
తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియల్ని నిర్వహించి ఆయనను గౌరవించుకుంది.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రామోజీ ఫిల్మ్ సీటికి వెళ్లి, రామోజీ రావు కుటుంబసభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. రామోజీరావు ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.