Medak News: ఇందిరమ్మ ఇళ్లలో వాళ్లకే ఎక్కువ లబ్ధి- మెదక్‌లో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం మెదక్ జిల్లాలో పర్యటించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసీఎం తన పర్యటనలో భాగంగా ఏడుపాయల వనదుర్గ మాత ఆలయాన్ని దర్శించుకొని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఎన్నికల ప్రచారానికి వచ్చానని ఇప్పుడు సీఎం హోదాలో జిల్లాకు రావడం ఆనందంగా ఉందన్నారు.
మెదక్‌లోని కేథడ్రల్ చర్చి శతాబ్ది ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ పర్యటన సందర్భంగా క్రైస్తవులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు చెప్పారు.
పర్యటనలో మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్లను దళిత, గిరిజన క్రైస్తవులకు ఎక్కువ లబ్ధి ఉంటుందన్నారు.
వందేళ్లు పూర్తిచేసుకున్న మెదక్ (Medak) చర్చికి దేశస్థాయిలో గుర్తింపు ఉందని దీని అభివృద్ధికి నిధులు కేటాయించినట్టు రేవంత్ చెప్పారు.
ఆరోగ్యశ్రీ సాయాన్ని రూ.10లక్షలకు పెంచామని, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని పేర్కొన్నారు.
రైతులకు రూ.21వేల కోట్ల రుణమాఫీ చేశామని సీఎం గుర్తు చేశారు.
ఈ పర్యటనలో సీఎం రేవంత్‌తోపాటు మంత్రి దామోదర రాజనర్సింహ, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, స్థానిక ఎమ్మెల్యే రోహిత్ రావు ఉన్నారు.
మెదక్ చర్చి ముందు కాంగ్రెస్ నాయకులతో ఫొటో దిగుతున్న సీఎం రేవంత్ రెడ్డి