Tank Bund: ట్యాంక్ బండ్ మీద వాహనాలకు నో ఎంట్రీ.. పర్యాటకులు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి
ఆదివారం సాయంత్రం ట్యాంక్ బండ్ మీదకు వెళ్తే.. ఎంతో ప్రశాంతత. గతంలో లాగా వాహనాలు రద్దీ లేదు. ఎంచక్కా కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేయోచ్చు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appట్యాంక్ బండ్ మీద ఆడుకుంటున్న చిన్నారి
సహజంగా ఆదివారం నాడు హుస్సేన్ సాగర్, ట్యాంక్ బండ్ పరిసరాలు కిక్కిరిసి కనిపిస్తుంటాయి. అదే సమయంలో ఆ రోడ్లపై వాహనాల రద్దీ కూడా అధికంగా ఉంటుంది.
హుస్సేన్ సాగర్ అందాలను తిలకించడానికి వచ్చే వారి కోసం హైదరాబాద్ పోలీసులు కొత్త చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే.
ఆదివారం సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ట్యాంక్ బండ్ మీదకి వాహనాలను అనుమతి లేదు. ట్యాంక్ బండ్ మీదకి వచ్చే వాహనాలను దారి మళ్లిస్తున్నారు.
ట్యాంక్ బండ్ మీదగా వెళ్లే వాహనాలను పీవీ మార్గ్, లోయర్ ట్యాంక్ బండ్ మీదుగా మళ్లిస్తున్నారు. అలాగే ట్యాంక్ బండ్ మీదకి వెళ్లే వారి వాహనాలకు కూడా బయటే పార్కింగ్ ఏర్పాట్లు చేశారు.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కేటీఆర్ నెటిజన్లకు టచ్‌లో ఉండటం తెలిసిందే. ఆస్క్ కేటీఆర్ అంటూ ప్రశ్నలకు జవాబిచ్చే సందర్భంలో నెటిజన్లు కేటీఆర్ దృష్టికి వాహనాల రద్దీ విషయం తీసుకెళ్లారు.
ట్యాంక్ బండ్ సందర్శకులకు వీకెండ్స్‌లో వాహనాల రాకపోకలు అడ్డుగా మారాయని.. అటూ ఇటూ వెళ్లేందుకు ఫ్యామిలీస్ ఇబ్బంది పడుతున్నాయని ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌కి మంత్రి కేటీఆర్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు.
నెటిజన్ ఐడియాని మెచ్చిన కేటీఆర్ ట్యాంక్ బండ్‌పై ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తే బాగుంటుందని.. సాధ్యాసాధ్యాలను పరిశీలించి ప్రణాళిక రూపొందించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కి ట్వీట్ చేశారు.
కేటీఆర్ నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే స్పందించిన హైదరాబాద్ పోలీస్ ట్యాంక్ బండ్‌పై ట్రాఫిక్ ఆంక్షలు విధించేందుకు సిద్ధమయ్యారు. ఆదివారం సాయంత్రం వేళలో సందర్శకులకు ఇబ్బంది కలగకుండా వాహనాల రాకపోకలను నిషేధించారు.