In Pics: అమెరికాలో కేటీఆర్ టూర్ ఫోటోలు, డిఫరెంట్ స్టైల్లో కూల్ లుక్స్ - మీటింగ్స్తో బిజీబిజీ
తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా అమెరికాలో మంత్రి కేటీఆర్ పర్యటన సాగుతోంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ లైఫ్ సైన్సెస్ కంపెనీ కెమ్ వేద ముందుకు వచ్చింది. శాండియాగోలోని సంస్థ కార్యాలయంలో మంత్రి కేటీఆర్ తో జరిగిన సమావేశంలో ఈ మేరకు ప్రకటన చేసింది.
తొలి రోజు సమావేశాల కోసం అమెరికాలోని శాన్ డియాగోలో అడుగు పెట్టిన మంత్రి కేటీఆర్ కి స్థానికంగా ఉన్న తెలుగు ఎన్నారైలు తెలంగాణ ఎన్నారైలు భారీ ఎత్తున స్వాగతం పలికారు.
శాన్డియాగోలో ఉన్న వ్యాపార వాణిజ్య అవకాశాల గురించి వారిని అడిగి మంత్రి తెలుసుకున్నారు.
హైదరాబాద్ ఫార్మాసిటీలో ఏర్పాటుచేయబోయే ఫార్మా యూనివర్సిటీలో భాగం కావాలని ప్రఖ్యాత పరిశోధన సంస్థ స్క్రిప్స్ ను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కోరారు.
అమెరికా పర్యటనలో భాగంగా ఇవాళ శాండియాగోలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్, స్క్రిప్స్ పరిపాలక సభ్యులైన డా. జేమ్స్ విలియమ్సన్ , మేరీవాంగ్, డాక్టర్. అర్నాబ్ ఛటర్జీ, ప్రొఫెసర్ సుమిత్ చందాలతో సమావేశమయ్యారు.
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేస్తున్న ఫార్మాసిటీ వివరాలను వారితో కేటీఆర్ పంచుకున్నారు.