In Pics: 3 టిమ్స్ ఆస్పత్రులకు కేసీఆర్ శంకుస్థాపన - భవన ఆకృతుల ఫోటోలు ఇవీ
మంగళవారం (ఏప్రిల్ 26) సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లో మూడు టిమ్స్ ఆస్పత్రులకు శంకుస్థాపనలు చేశారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appహైదరాబాద్ నగరానికి నాలుగు వైపులా సూపర్ స్పెషాలిటీ సౌకర్యాలతో నాలుగు ఆస్పత్రులను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మూడు కొత్త ఆస్పత్రులను ఏర్పాటు చేస్తున్నట్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.
ఇప్పటికే హైదరాబాద్‌కు ఒక వైపున గచ్చిబౌలిలో టిమ్స్ ఆస్పత్రిని ఏర్పాటు చేశామని మిగతా మూడు వైపులు ఎర్రగడ్డ, ఎల్బీ నగర్, అల్వాల్‌లో ఒక్కొక్కటి వెయ్యి పడకల చొప్పున అత్యాధునిక సౌకర్యాలతో టిమ్స్ ఆస్పత్రులను నిర్మించతలపెట్టినట్లుగా సీఎం తెలిపారు.
ఒక్కో టిమ్స్‌ను వెయ్యి పడకల సామర్థ్యంతో నిర్మించనున్నారు.
ప్రతి ఆస్పత్రిలో 26 ఆపరేషన్ థియేటర్లు, 300 ఐసీయూ పడకలతో పాటు ఆక్సిజన్ సౌకర్యం అందుబాటులోకి ఉంటుంది.
ఎర్రగడ్డలో నిర్మించే టిమ్స్ ఆస్పత్రి 17 ఎకరాల్లో జీ + 14 అంతస్తుల్లో నిర్మించనున్నారు.
ఈ మల్టిసూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు రూ.882 కోట్లు కేటాయించారు.
కొత్తపేట టిమ్స్ ను 21.36 ఎకరాల్లో జీ + 14 అంతస్తుల్లో వెయ్యి పడకల సామర్థ్యంతో నిర్మించనున్నారు. ఈ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు రూ.900 కోట్లు కేటాయించారు.
అల్వాల్ టిమ్స్ కూడా వెయ్యి పడకలతో నిర్మితం అవుతుంది. 28.41 ఎకరాల్లో జీ + 5 అంతస్తుల్లో నిర్మించనున్నారు. ఈ మల్టీసూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు రూ.897 కోట్లు కేటాయించారు.
ఈ కార్యక్రమాల్లో మంత్రులు హరీశ్ రావు, మహముద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సీహెచ్ మల్లా రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, సుధీర్ రెడ్డి, మైనంపల్లి హన్మంత్ రావు, వివేకానంద గౌడ్, కాలేరు వెంకటేశ్, సాయన్న, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు (కేకే), జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో పాటు పలువురు స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.