In Pics: ఎల్బీ స్టేడియంలో యోగా ఉత్సవ్ - పాల్గొన్న తమిళిసై, మంచు విష్ణు, లావణ్య త్రిపాఠి
ఆజాదికా అమృత్ మహోత్సవంలో భాగంగా జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా దినోత్సవం పురస్కరించుకొని 25 రోజుల యోగా ఉత్సవ్ కార్యక్రమాన్ని ఎల్బీ స్టేడియంలో గవర్నర్ తమిళిసై ప్రారంభించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సర్భనంద్ సోనోవల్, ఎమ్మెల్యే రాజసింగ్, క్రికెటర్ మిథాలీ రాజ్, సినిమా యాక్టర్స్ విష్ణు మంచు, లావణ్య త్రిపాఠి పాల్గొన్నారు.
‘‘మీరు నిత్యం యంగ్ గా ఉండాలంటే యోగా చేయాలి. జూన్ 21న యోగా డే ను జరుపుకోవడానికి ప్రధాన కారణం.. ఆ రోజు ఏడాది మొత్తం మీద ఎక్కువ పగలు ఉండే రోజు. ప్రపంచ వ్యాప్తంగా 190 పైగా దేశాల్లో యోగా దినోత్సవం నిర్వహిస్తున్నారు.
ఇందులో 41 ముస్లిం దేశాలు సైతం ఉన్నాయి. దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు అందరూ యోగా చేసి హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నా’’ అని గవర్నర్ తమిళిసై అన్నారు.
‘‘2014 డిసెంబరులో ఐక్యరాజ్య సమితి జూన్ 21 న ప్రపంచ యోగా దినోత్సవం ప్రకటించింది. 25 రోజుల యోగా కౌంట్ డౌన్ పండుగ ఇక్కడ జరుగుతుంది. జూన్ 21 న పెద్ద ఎత్తున యోగా డే ను ట్యాంక్ బండ్ మీద అంబేడ్కర్ విగ్రహం వద్ద నిర్వహిస్తాం.
యోగాతో జీవితంలో క్రమశిక్షణ వస్తుంది. ప్రపంచంలో ఉన్నా ఇస్లామిక్ దేశాలు సైతం యోగా కార్యక్రమంలో నిర్వహిస్తున్నారు. ఐటీ సంస్థలు సైతం యోగా డేను నిర్వహించబోతున్నాయి’’ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
యోగా డేను హైదరాబాద్ లో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రధాని మోదీ చొరవతో యోగా దినోత్సవం ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహించినందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ధన్యవాదాలు.’’ అని సర్భనంద సోనోవల్ అన్నారు.