KL Rahul: 4 సీజన్లలో 600+ స్కోర్లా! రాహుల్ నీకు తిరుగులేదు సామీ!
ఐపీఎల్ 2022లో లక్నో సూపర్ జెయింట్స్ ప్రస్థానం ముగిసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఎలిమినేటర్‌లో ఓటమి పాలైంది. ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ మాత్రం రికార్డుల పరంపర కొనసాగిస్తూనే ఉన్నాడు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఐపీఎల్ 2022లో ఎక్కువ పరుగులు చేసిన ఇండియన్ బ్యాటర్ కేఎల్ రాహుల్. 15 మ్యాచుల్లో 51.33 సగటు, 135 స్ట్రైక్‌రేట్‌తో 616 పరుగులు చేశాడు. ఇక ఎక్కువ హాఫ్ సెంచరీలు చేసిన ఇండియన్ అతడే. 4 అర్థశతకాలు, 2 సెంచరీలు కొట్టాడు.
ఐపీఎల్ 2022లో ఎక్కువ సిక్సర్లు కొట్టిన భారత బ్యాటర్ కేఎల్ రాహుల్. 30 సిక్సర్లు కొట్టాడు. 45 బౌండరీలు బాదేశాడు.
ఐపీఎల్ చరిత్రలో నాలుగు సార్లు 600+ పరుగులు చేసిన ఏకైక ఆటగాడు కేఎల్ రాహుల్. 2020 నుంచి వరుసగా 670, 626, 616 చేశాడు. 2018లో 659 కొట్టాడు. వరుసగా ఐదు సీజన్లలో 500 + రన్స్ చేశాడు.
ఐపీఎల్ 2022లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడు కేఎల్ రాహుల్. 15 మ్యాచుల్లో 616 చేశాడు. రాజస్థాన్ ఓపెనర్ జోస్ బట్లర్ 15 మ్యాచుల్లో 718తో అతడి కన్నా ముందున్నాడు. (All Images:iplt20.com)