Kaithalapur Flyover Pics: కైతలాపూర్ ఫ్లైఓవర్ ప్రారంభం - ఈ రూట్స్‌లో బాగా తగ్గిన దూరం
కూకట్ పల్లి - హైటెక్ సిటీల మధ్య ప్రయాణించే ప్రయాణికులకు నేటి నుంచి (జూన్ 21) ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appహైటెక్ సిటీ - బోరబండ రైల్వే స్టేషన్ల మధ్య నిర్మించిన కైతలాపూర్ రైల్వే ఓవర్ బ్రిడ్జిని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించారు.
ఈ ఫ్లైఓవర్ తో కూకట్ పల్లి, హైటెక్ సిటీల మధ్య ప్రయాణం ఇకపై సాఫీగా సాగనుంది.
ఈ ఫ్లై ఓవర్ ప్రభావంతో ఇక జేఎన్టీయూ జంక్షన్, మలేషియన్ టౌన్ షిప్ జంక్షన్, హైటెక్ సిటీ ఫ్లై ఓవర్, సైబర్ టవర్స్ జంక్షన్ల వద్ద ట్రాఫిక్ సమస్య తగ్గనుంది.
వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం ద్వారా ఈ ఫ్లైఓవర్ నిర్మాణం అయింది. ఎస్ఆర్ఢీపీ ద్వారా చేపట్టిన 41 పనుల్లో 29 పనులు ఇప్పటికే పూర్తయ్యాయి.
రూ.86 కోట్ల ఖర్చుతో ఈ బ్రిడ్జిని నిర్మించారు. ఇది అందుబాటులోకి వస్తే హైటెక్ సిటీ – కూకట్ పల్లి, జేఎన్టీయూ – హైటెక్ సిటీ వెళ్లే వారికి ప్రయాణం సులువు అవుతుంది.
సనత్ నగర్, బాలానగర్ మీదుగా సికింద్రాబాద్ వరకు 3.50 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది.