In Pics: పరేడ్ గ్రౌండ్స్‌లో యోగా డే, పాల్గొన్న ఉప రాష్ట్రపతి - ఆసనాలు వేసిన అడివి శేష్, సింధూ
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్‌లో యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనగరంలోని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పీవీ సింధు, అడివి శేష్, ఈటల రాజేందర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ... యోగా యూనిటీ, ఇంటిగ్రిటీ, శరీరానికి ఆరోగ్యాన్నిస్తుందని తెలిపారు.
యోగా అంటే ఇంద్రియాలను ఏకం చేయడం, ఆత్మశక్తిని ఏకం చేయడం అని చెప్పుకొచ్చారు. యోగా ప్రాచీనమైనదే అయినా దోషం పట్టనిదని అన్నారు.
యోగాకు కులం, మతం, అడ్డంకులు లేవని ఉప రాష్ట్రపతి అన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా యోగాను పాపులర్ చేసినందుకు ప్రధాని మోదీకి, యోగాను కనుగొన్న మన పూర్వీకులకు ధన్యవాదాలు తెలియజేశారు.
ప్రాశ్చాత్య వ్యామోహంతో వచ్చిన మార్పులతో యోగా విశిష్టత మరింత పెరిగిందన్నారు.
యోగా మహోత్సవ్‌ను విజయవంతం చేసినందుకు ప్రజలకు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు తెలియజేశారు.