In Pics: ప్రగతి భవన్లో ఏ లిఫ్టు ఉందో ఇక్కడా అదే.. 288 డబుల్ బెడ్రూం ఇళ్లు ప్రారంభించిన కేటీఆర్
హైదరాబాద్లోని చంచల్గూడ సమీపంలో ఉన్న పిల్లి గుడిసెల బస్తీలో జీహెచ్ఎంసీ నిర్మించిన 288 రెండు పడక గదుల ఇళ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఇవాళ ప్రారంభించుకున్న ఇళ్లు ప్రైవేట్ బిల్డర్ కడితే ఒక్కొక్కదానికి రూ.30 లక్షలు అవుతుందని పేర్కొన్నారు. కానీ ప్రభుత్వం పేదలందరికీ ఉచితంగా ఇస్తోందని అన్నారు. నాణ్యత విషయంలో కూడా రాజీ పడకుండా నిర్మాణం చేపట్టామని తెలిపారు. ప్రగతి భవన్లో ఏ లిఫ్ట్ ఉందో అదే కంపెనీ లిఫ్టు ఈ డబుల్ బెడ్ రూం ఇళ్లలోనూ అమర్చామని తెలిపారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకేసీఆర్ నాయకత్వంలో పాత, కొత్త నగరం అనే తేడా లేకుండా హైదరాబాద్లో అభివృద్ధి జరుగుతోందని అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, ఫ్లై ఓవర్లు, ఇతర ప్రాజెక్టులు అన్నీ త్వరగానే పూర్తి చేస్తామని అన్నారు. చంచల్గూడ 34 ఎకరాల్లో ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో హోం మంత్రి మహమ్మద్ ఆలీ, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, మలక్పేట్ ఎమ్మెల్యే బలాల, మంత్రులు తలసాని, ప్రశాంత్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మా రావు, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత తదితరులు పాల్గొన్నారు.
చంచల్గూడ సమీపంలో పిల్లి గుడిసెల బస్తీలో జీహెచ్ఎంసీ నిర్మించిన 288 డబుల్ బెడ్ రూం ఇళ్లను రూ.24.91 కోట్ల వ్యయంతో 9 అంతస్తుల్లో నిర్మించారు. వీటిలో మొత్తం 288 డబుల్ బెడ్ రూం ఫ్లాట్లు ఉన్నాయి.
ఒక్కో డబుల్ బెడ్ రూమ్ 560 చదరపు అడుగుల విస్తీర్ణం ఉంటుంది. ఒక్కొక్క డబుల్ బెడ్ రూమ్ ఖర్చు రూ.8.65 లక్షల వ్యయం అయింది. గతంలో మురికివాడగా ఉన్న బస్తీని జీహెచ్ఎంసీ ఇప్పుడు ఇలా తయారు చేసింది.