Tokyo Paralympics 2020: చరిత్ర సృష్టించిన భవినాబెన్.. పతకం ఖాయం చేసుకున్న తొలి ప్యాడ్లర్
భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భవినాబెన్ చరిత్ర సృష్టించింది. పారాలంపిక్స్‌లో టేబుల్ టెన్నిస్ విభాగంలో సెమీస్‌కు చేరిన మొట్టమొదటి భారత ప్యాడ్లర్‌గా రికార్డు నెలకొల్పింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅంతేకాదు కాదు టోక్యో పారాలింపిక్స్‌లో పతకాన్ని ఖాయం చేసుకున్న మొట్టమొదటి భారత క్రీడాకారిణిగానూ భవినాబెన్ పటేల్ నిలిచింది.
మొదటి మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికీ విశేషంగా పుంజుకున్న భవినాబెన్ వరుస విజయాలతో దూసుకెళ్లింది.
అదే ఊపుతో క్వార్టర్స్‌లో ఆమె 11-5, 11-6, 11-7 వరుస గేముల్లో సెర్బియాకు చెందిన ప్రపంచ రెండో ర్యాంకర్ బొరిస్‌లవ పెరిక్ రంకోవిచ్ను మట్టికరిపించింది.
18 నిమిషాల్లోనే ఈ ఆటను ముగించడం విశేషం. శనివారం జరిగే సెమీస్ పోరులో ఆమె చైనా ప్లేయర్ ఝాంగ్ మియావ్తో తలపడనుంది. సెమీస్‌లో ఓడినా భవినాబెన్‌కు కాంస్య పతకం లభిస్తుంది.