KCR: దళితబంధుపై సీఎం కేసీఆర్ సమీక్ష.. పార్టీ కార్యకర్తలతో కలిసి భోజనం
దళిత బంధు పథకం అమలుపై స్వయంగా పర్యవేక్షణ చేస్తున్న సీఎం కేసీఆర్ శుక్రవారం నేరుగా కరీంనగర్ వెళ్లి సమీక్షా సమావేశం నిర్వహించారు. దళిత బంధు అమలుకు సంబంధించి అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రాణ త్యాగానికి సిద్ధపడి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విధంగానే దళిత బంధు విజయవంతం కోసం పనిచేస్తానని సీఎం హామీ ఇచ్చారు.
తన చివరి రక్తపు బొట్టు దాకా దళితుల సమగ్రాభివృద్ధి కోసం పోరాడతానని కేసీఆర్ దళితులకు హామీ ఇచ్చారు.
దళిత జాతి పేదరికంలో మగ్గిపోతూ సామాజిక వివక్షకు గురవడానికి సమాజమే కారణమని అన్నారు.
దళితుల పట్ల అనుసరిస్తున్న దురాచారాన్ని కట్టడి చేసి దళితుల ఆర్థిక, సామాజిక అభ్యున్నతికి తెలంగాణ సమాజమంతా కదిలి రావాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.
దళితబంధు పథకానికి పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న 20,929 దళిత కుటుంబాలన్నింటికి ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించారు.
పార్టీ కార్యకర్తలతో కలిసి భోజనం చేస్తున్న సీఎం కేసీఆర్
పార్టీ కార్యకర్తలతో కలిసి భోజనం చేస్తున్న సీఎం కేసీఆర్
పార్టీ కార్యకర్తలతో కలిసి భోజనం చేస్తున్న సీఎం కేసీఆర్