Kothaguda Flyover Photos: ఐటీ కారిడార్లో కొత్తగూడ ఫ్లైఓవర్ ప్రారంభం, ట్రాఫిక్ సమస్యలకు సర్కార్ చెక్
ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ క్ సమస్యలు, సిగ్నల్ లేని ప్రయాణం సాగించేలా కొత్త సంవత్సరం కానుకగా రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త ఫ్లైఓవర్ ను అందుబాటులోకి తీసుకు వచ్చింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఐటీ కారిడార్ కు మరో మణిహారంగా కొత్తగూడలో నిర్మాణం పూర్తయిన ఫ్లైఓవర్, అండర్ పాస్ లను మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ ఆదివారం ప్రారంభించారు.
ఈ కొత్త కారిడార్ తో ఆల్విన్ కాలనీ నుంచి గచ్చిబౌలి జంక్షన్ వరకు సిగ్నల్ లేని ప్రయాణం చేసే వీలు ఉంటుంది.
గచ్చిబౌలి నుంచి ఆల్విన్ కాలనీ కూడలి వైపు వన్ వే ఫ్లైఓవర్ గా ఇది అందుబాటులోకి వచ్చింది.
గచ్చిబౌలి నుంచి వచ్చే వాహనాలు, మసీద్ బండా, బొటానికల్ గార్డెన్ నుండి వచ్చే వాహనాలు ఈ కొత్త ఫ్లైఓవర్ పై నుంచి వెళ్తాయి.
ఈ ఫ్లైఓవర్ మీది నుంచి మాదాపూర్, హఫీజ్ పేట్ వైపు వెళ్లవచ్చు. శరత్ సిటీ క్యాపిటల్ మాల్, కొత్తగూడ జంక్షన్ల వల్ల ట్రాఫిక్ తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు.
మాదాపూర్, కొండాపూర్, కొత్తగూడ, హఫీజ్ పేట్, బొటానికల్ గార్డెన్, గచ్చిబౌలి ప్రాంతాలకు సులభతరంగా రాకపోకలు సాగించవచ్చు.
కొండాపూర్ బొటానికల్ గార్డెన్, కొత్తగూడ కూడళ్లలో ట్రాఫిక్ తగ్గనుంది. ఆల్విన్ కాలనీ నుంచి గచ్చిబౌలి జంక్షన్ వరకు సిగ్నల్ ప్రయాణం సులభం కానుంది.
మాదాపూర్ నుంచి బొటానికల్ గార్డెన్, గచ్చిబౌలి వైపు వెళ్లే వారు ట్రాఫిక్ లో చిక్కుకోకుండానే ఇకపై రాకపోకలు సాగించే అవకాశం రానుంది.