Amardeep Chowdary : ఓటీటీలో అమర్ దీప్ చౌదరి, ఎస్తేర్ సినిమా అరుదైన రికార్డ్
'జానకి కలగనలేదు' సీరియల్ ఫేమ్ అమర్ దీప్ చౌదరి కథానాయకుడిగా... తన్వి నేగి కథానాయికగా... ఎస్తేర్ నోర్హ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం 'ఐరావతం'. ఈ సినిమా నవంబర్ 17న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో విడుదలైంది. దీనికి ఊహించని ఆదరణ దక్కించుకుంది. ఇప్పటి వరకు 100 మిలియన్ & 50 థౌజండ్ వ్యూయింగ్ (స్ట్రీమింగ్) మినిట్స్‌ను సాధించింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఓటీటీలో అరుదైన రికార్డ్ సాధించిన చిన్న సినిమాగా 'ఐరావతం' నిలిచిందని చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేసింది.
'ఐరావతం'లో శ్లోక అనే బ్యూటీషియన్ పాత్రలో హీరోయిన్ తన్వి నేగి నటించారు. ఆమె పుట్టిన రోజుకు బాయ్ ఫ్రెండ్ (హీరో) ఓ కెమెరా గిఫ్ట్ ఇస్తాడు. అందులో వీడియోలు తీస్తే... మరొక వీడియో వస్తుంది. ఎందుకు అలా జరుగుతుంది? అని ఆరా తీస్తే... ఎన్నో సీక్రెట్స్ బయటకు వస్తాయి. చివరి ఏమైంది? అనేది సినిమా.
'ఐరావతం'లో తన్వి నేగి డ్యూయల్ షేడ్స్ ఉన్న రోల్ చేశారు. అందులో ఓ రోల్ సిగరెట్ తాగుతూ కనిపిస్తుంది.
నూజివీడు టాకీస్ పై రేఖ పలగని సమర్పణలో రాంకీ పలగాని, బాలయ్య చౌదరి చల్లా, లలిత కుమారి తోట నిర్మాతలుగా 'ఐరావతం' చిత్రాన్ని నిర్మించారు. సుహాస్ మీరా దర్శకత్వం వహించారు.
'ఐరావతం'లో తన్వి నేగి
'ఐరావతం'లో తన్వి నేగి