In Pics: హైదరాబాద్లో తొలిసారిగా ప్రియాంక గాంధీ, ఫోటోలు చూసేయ్యండి
ప్రియాంక గాంధీ బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో ఎల్బీనగర్కు వెళ్లారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appశ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాల వేసి సరూర్ నగర్ స్టేడియం వరకూ ఆమె పాదయాత్రగా వెళ్లారు.
సరూర్ నగర్ స్టేడియంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ యువ సంఘర్షణ సభలో పాల్గొన్నారు.
తెలంగాణలో కొన్ని నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయని, ప్రభుత్వాన్ని ఎన్నుకునేటప్పుడు అప్రమత్తతో ఉండాలని సూచించారు.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి నెలకు రూ.4 వేలు ఇస్తామని అన్నారు.
గడిచిన రెండు వారాలుగా తాను కర్ణాటకలో ప్రచారంలో పాల్గొన్నానని అన్నారు.
జై బోలో తెలంగాణ అంటూ ప్రియాంక గాంధీ ప్రసంగం ప్రారంభించారు.
‘‘మేం ఇచ్చిన యూత్ డిక్లరేషన్ అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ది. మేము అమలు చేయకపోతే మా ప్రభుత్వాన్ని దించేయండి అని ప్రియాంక అన్నారు.
టీఎస్పీఎస్సీ పరీక్షా పేపర్లు లీక్ అయ్యాయి. వారిపై ఏమైనా చర్యలు తీసుకున్నారా? అని ప్రశ్నించారు.
తెలంగాణలో ప్రతి వ్యక్తిపై వేల కోట్ల రూపాయల అప్పు ఉందని, రాష్ట్ర డబ్బు, సంపద అంతా ఎక్కడికి పోయిందని కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రశ్నించారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఏ ప్రభుత్వం వచ్చినా మంచి జరుగుతుందని అందరూ నమ్మారని అన్నారు.
గత 9 ఏళ్లలో 12 రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో ఒక్క ఖాళీని కూడా భర్తీ చేయలేదని అన్నారు.