In Pics: హైదరాబాద్లో వర్ష బీభత్సం, రోడ్లపై వరద - జనాల నరకయాతన - ఫోటోలు
హైదరాబాద్ లో భారీగా వర్షం పడింది. ఉదయం నుంచి మబ్బు పట్టిన వాతావరణం ఉండగా మధ్యాహ్నానికి పెద్ద వర్షం కురిసింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appహైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో కారు మబ్బులు కమ్మి ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది.
బంజారా హిల్స్ ఉదయ్ నగర్ కాలనీలో వర్షానికి నాలా రిటైనింగ్ వాల్ కూలింది.
ఈ నాలను అధికారులతో కలిసి జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ పరిశీలించారు.
ప్రజలకు వరద వల్ల ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కమిషనర్ వెంట జోనల్ కమిషనర్, డీసీ ఇంజనీరింగ్ అధికారులు అన్నారు.
ఉదయ నగర్ కాలనీలో నాలా స్లాబ్ కొట్టుకుపోయిన ప్రాంతాన్ని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పరిశీలించారు.
బంజారా హిల్స్ డివిజన్లోని ఉదయ నగర్ కాలనీలో భారీ వర్షానికి నాలా స్లాబ్ కొట్టుకొని పోయింది.
అదే ప్రాంతంలో వర్షం దాటికి టూ వీలర్లు సైతం వరదలు కొట్టుకుపోయాయి.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించిన మేయర్.
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం పరిసర ప్రాంతాల్లో అత్యధికంగా 9.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
మలక్ పేటలో 8.4 సెంటీమీటర్లు, బంజారాహిల్స్ వేంకటేశ్వర కాలనీలో 8.3 సెంటీమీటర్లు, బేగంబజార్ లో 8.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు
గోల్కొండలో 7.5 సెంటి మీటర్లు, కృష్ణా నగర్ లో 7.4 సెంటీమీటర్లు, అరామ్ ఘడ్ 7.3 సెంటీమీటర్లు
బంజారాహిల్స్, గోల్కొండ లో 7.2 సెంటీమీటర్లు, చార్మినార్ లో 6.5 సెంటీమీటర్లు, పాటిగడ్డ వద్ద 6.1 సెంటీమీటర్లు నమోదు
బేగంపేట్ లో 5.8 సెంటీమీటర్లు, మూసాపేట్ లో 4.9 సెంటీమీటర్లు, ఉప్పల్ లో 4.6 సెంటీమీటర్లు
అల్వాల్ లో 4.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు, నిజాంపేట్, కూకట్ పల్లి, మాదాపూర్, జూబ్లీహిల్స్ లోనూ భారీ వర్షం నమోదు
నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ హెచ్చరించింది
జీహెచ్ఎంసీ - డీఆర్ఎఫ్ సహాయం కోసం 040 - 21111111 కు లేదా 9000113667కు కాల్ చేయాలని జీహెచ్ఎంసీ అధికారులు చెప్పారు.
హైదరాబాద్ లో ఈ రాత్రికి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ హెచ్చరించింది.
ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచించింది.
చార్మినార్ వద్ద వర్షం కారణంగా నిలిచిన నీరు