IAS Uma Harathi: ట్రెయినీ ఐఏఎస్ అధికారిణిగా వచ్చిన కుమార్తెకు గర్వంతో తండ్రి సెల్యూట్ - Happy Fathers Day
హైదరాబాద్‌లోని తెలంగాణ పోలీస్ అకాడమీలో శనివారం ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఉన్నత హోదాలో వచ్చిన కుమార్తెకు తండ్రి గర్వంతో సెల్యూట్ చేశారు. పుత్రికోత్సాహంతో ఆయన గుండె ఆనందంతో బరువెక్కింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతెలంగాణకు చెందిన ఎన్ ఉమాహారతి యూపీఎస్సీ సివిల్స్ పరీక్షల్లో జాతీయ స్థాయిలో మూడో ర్యాంక్ సాధించడం తెలిసిందే. తాజాగా ఆ కూతురి విజయం, కన్నతండ్రికి గర్వకారణంగా నిలిచింది.
ట్రెయినీ ఐఏఎస్ అధికారిణి ఉమాహారతి రాష్ట్ర పోలీస్ అకాడమీకి వచ్చారు. అక్కడే ఉన్న ఐపీఎస్, పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ ఎన్ వెంకటేశ్వర్లు తన కుమార్తెను చూసి సెల్యూట్ చేశారు. పుష్పగుచ్ఛం అందించి అకాడమీకి స్వాగతం పలికారు. ఈ ఆసక్తికర ఘటనతో ఎంతో మందికి ఆ తండ్రి, కూతురు స్ఫూర్తిదాయకంగా నిలిచారు.
నారాయణపేట జిల్లా ఎస్పీగా వెంకటేశ్వర్లు సేవలు అందిస్తున్న సమయంలో కుమార్తె ఉమాహారతి సివిల్ సర్వీసెస్ 2022లో ఐఏఎస్ ఆల్ ఇండియా మూడో ర్యాంకు సాధించడం తెలిసిందే. అనంతరం ఆయన పోలీస్ అకాడమీకి బదిలీ అయ్యారు. ఫాదర్స్ డే కు ముందురోజు ట్రైనీ ఐఏఎస్‌గా వచ్చిన కుమార్తెకు ఎస్పీ ర్యాంక్ అధికారి అయిన తండ్రి వెంకటేశ్వర్లు సెల్యూట్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.