In Pics: అయోధ్య రామ మందిర్ థీమ్‌తో బాలాపూర్ గణపతి - ఫోటోలు
హైదరాబాద్ లో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ సంవత్సరం బాలాపూర్ గణపతి ‘అయోధ్య రామ మందిరం’ థీమ్‌తో రూపుదిద్దుకున్నాడు.
దీనితో బాలపూర్ గణపతి మండపాన్ని చూసేందుకు భక్తులు వేలాదిగా తరలి వస్తున్నారు.
గతేడాది విజయవాడ కనక దుర్గమ్మ గుడి ఆకారంలో ఈ ఆలయ మండపాన్ని డెకరేట్ చేసారు. ఈ ఏడాది అయోధ్య రామ మందిరం ప్రతిరూపం కలిగిన ఈ గణపతిని దర్శించుకోవడం సంతోషం గా ఉందని చెబుతున్నారు భక్తులు.
ప్రతి ఏడాది లాగానే, బాలాపూర్ గణేష్ మండపం భక్తులతో సందడిగా మారింది.
స్వామివారు చతుర్భుజాలతో ఉన్న ఈ విగ్రహం, కుడిచేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో గొడ్డలితో దర్శనం ఇస్తున్నారు.
ఈసారి లడ్డూ వేలంపాట కూడా ప్రత్యేకంగా సాగనుంది. ఏటా ఇక్కడి లడ్డూ 25 లక్షల వరకూ ధర పలికే సంగతి తెలిసిందే.
ఈ గణేష్ నవరాత్రుల సమయం లో భక్తులకు ఏటువంటి అసౌకర్యం కలుగకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.