Abhinaya: టుస్సాడ్స్ మ్యూజియంలో అభినయ- అమ్మడు ఫన్నీ ఫోజులు చూశారా?
తమిళ బ్యూటీ అభినయ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. పుట్టుకతోనే దివ్యాంగురాలు. మాట్లాడలేదు. వినపడదు. Photo Credit: M.g Abhinaya/Instagram
దివ్యాంగురాలైనా అభినయ కుంగిపోలేదు.. సినిమా పరిశ్రమలో చక్కటి నటనతో రాణిస్తోంది. అందం, అభినయంతో ఆకట్టుకుంటున్నది. Photo Credit: M.g Abhinaya/Instagram
తెలుగులో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', ‘నేనింతే‘, ‘కింగ్‘, ‘శంభో శివ శంభో‘, ‘దమ్ము‘, ‘ఢమరుకం‘, ‘ధృవ‘, ‘రాజుగారి గది 2‘, ‘సీతారామం‘, ‘గామి‘, ‘ఫ్యామిలీ స్టార్‘ సహా పలు సినిమాల్లో నటించింది. తదితర చిత్రాల్లోనూ యాక్ట్ చేసింది. Photo Credit: M.g Abhinaya/Instagram
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ లండన్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. అక్కడి పర్యాటక ప్రదేశాలు చూస్తూ సరదాగా గడుపుతోంది. Photo Credit: M.g Abhinaya/Instagram
లండన్ వెకేషన్ లో భాగంగా ప్రపంచ ప్రఖ్యాత మేడం టుస్సాడ్స్ మ్యూజియానికి వెళ్లింది. Photo Credit: M.g Abhinaya/Instagram
మ్యూజియంలోని పలువురు ప్రముఖల మైనపు విగ్రహాల దగ్గర ఫోటోలకు ఫోజులిచ్చింది. ఫన్నీ స్టిల్స్ లో ఆకట్టుకుంది. Photo Credit: M.g Abhinaya/Instagram
ప్రస్తుతం అభినయ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అమ్మడు ఫన్నీ ఫోజులు చూసి నెటిజన్లు ఎంజాయ్ చేస్తున్నారు. Photo Credit: M.g Abhinaya/Instagram