Ganesh Chaturthi 2024: ముంబైలో సౌత్ హీరోయిన్స్ సందడి - అంబానీ ఇంట్లో స్పెషల్ అట్రాక్షన్‌గా...
పూజా హెగ్డే బెంగళూరు అమ్మాయి. ముంబైలో సెటిల్ అయ్యింది. హిందీ సినిమాలు చేస్తోంది. అయితే... సౌత్ సినిమాలతో స్టార్ అయ్యింది. ముంబైలోని అంబానీ ఇంట వినాయక చవితి వేడుకల్లో ఇలా సందడి చేసింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతమన్నా భాటియా పంజాబీ. కానీ, ఆమెకు కథానాయికగా విజయాలు వచ్చింది సౌత్ సినిమాలతో. ఆ తర్వాత బాలీవుడ్ పిలిచింది. ముంబైలో ఉంటున్న ఈ అందాల భామ అంబానీ ఇంట ఈ దుస్తుల్లో సందడి చేసింది.
కాజల్ అగర్వాల్ ముంబై సెటిలర్. అయితే, హైదరాబాద్ సిటీలో ఇల్లు కొనుక్కుని ఇక్కడ కొన్ని రోజులు, ముంబైలో కొన్ని రోజులు ఉంటుంది. అంబానీ ఇంట గణేష్ చతుర్థి వేడుకలకు చీరలో హాజరయ్యారు.
విజయ్ దేవరకొండతో 'లైగర్'లో నటించింది కనుక అనన్యా పాండేను సైతం సెమీ సౌత్ హీరోయిన్ అనుకోవచ్చు. అంబానీ ఇంట వినాయక చవితి వేడుకల్లో మీడియాకు హాయ్ చెబుతున్న ఆవిడను చూడండి.