ABP Southern Rising Summit 2024 Yamini Reddy : గజేంద్రమోక్షం కథ మీకు తెలుసుకదా.. ఆ కథని దృశ్య రూపంలో చూశారా ఎప్పుడైనా!
నాట్యానికీ ఓ భాష ఉంటుంది..దాన్ని అర్థం చేసుకోవాలంటారు కూచిపూడి నాట్యకారిణి యామిని రెడ్డి. డాన్సర్ అవ్వాలంటే ఎంతో కష్టపడాలి.. అందుకే మా అమ్మ భయపడింది.. అందుకే డాన్స్ వద్దు అనేసింది..కానీ ఆ తర్వాత తన నిర్ణయం మార్చుకుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనాట్యం తప్ప ఇంకేం చేయకూడదని నిర్ణయించుకున్నాను..అప్పుడే నా జీవితం మలుపుతిరిగిందని ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ లో చెప్పారు యామిని రెడ్డి.
కూచిపూడి నృత్యం, ముద్రలు గురించి వివరించిన యామిని రెడ్డి.. గజేంద్రమోక్షం కథని చెబుతూ..ముద్రలో రూపంలో నృత్య ప్రదర్శన చేశారు..
నీటికోసం మడుగులోకి అడుగుపెట్టిన ఏనుగు.. ఏనుగు కాళ్లు పట్టుకున్న మొసలి.. విడిపించుకునేందుకు చేసిన పోరాటం...
బయటకు వచ్చేందుకు ఏనుగు పోరాటం..లోపలకు లాగేందుకు మొసలి ప్రయత్నం. ఇక తన ఒంట్లో శక్తి మొత్తం తగ్గిపోవడంతో శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తుంది ఏనుగు
శ్రీమహాలక్ష్మితో వైకుంఠంలో సేదతీరుతున్న విష్ణువు.. తన భక్తుడైన గజేంద్రుడి ఆక్రందన, ప్రార్థన విని శంఖు, చక్రాలను కూడా తీసుకోకుండా వెంటనే బయలుదేరుతాడు..
శంఖం, చక్రంతో స్వామివారిని అనుసరిస్తూ వస్తాయి.. ఆతర్వాత సుదర్శన చక్రంతో మొసలిని సంహరించి ఏనుగును కాపాడతాడు శ్రీ మహావిష్ణుడు..
ఈ మొత్తం కథని ముద్రల రూపంలో వివరిస్తూ నాట్యానికి ఉండే భాషను అర్థమయ్యేలా వివరించారు యామిని రెడ్డి
యామిని రెడ్డి.. కూచిపూడి విద్వాంసులు పద్మభూషణ్‌లు డా. రాజా రాధా రెడ్డి , కౌశల్య రెడ్డి పెద్ద కుమార్తె & శిష్యురాలు. భారతదేశం సహా విదేశాలలో ప్రదర్శనలు ఇచ్చి ప్రేక్షకులను మెప్పించి మూడు సార్లు జాతీయ అవార్డు అందుకున్నారు.