Dhanteras 2024: ధన త్రయోదశికి 'యమదీపం' ఏ సమయంలో వెలిగించాలి!
ఆయుర్వేద విజ్ఞానానికి అధిపతి అయిన ధన్వంతరి జయంతి రోజే ధన త్రయోదశి. ఇదే రోజు సాయంత్రం ఇంటి ద్వారం బయట దీపం వెలిగిస్తారు. దానినే యమదీపం అని పిలుస్తారు. యమదీపం వెలిగించడం వెనుక ఓ పురాణగాథ ప్రచారంలో ఉంది. పూర్వకాలంలో ‘హిమ’ అనే మహా రాజుకి లేక లేక ఓ కొడుకు జన్మిస్తాడు. అయితే తన జాతకం చూసిన రాజగురువు... ఆ యువరాజు పెళ్లైన నాలుగో రోజు చనిపోతాయడని చెబుతారు. కాలక్రమంలో ఆ రాకుమారుడిని ఓ రాకుమారి వరిస్తుంది. తన జాతకం గురించి చెప్పినప్పటికీ...తననే వివాహం చేసుకుంటానని పట్టుబడుతుంది. చేసేది లేక ఇరు రాజకుటుంబాలు అంగీకరించి వివాహం జరిపిస్తాయి .
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపూర్వకాలంలో ‘హిమ’ అనే మహా రాజుకి లేక లేక ఓ కొడుకు జన్మిస్తాడు. అయితే తన జాతకం చూసిన రాజగురువు... ఆ యువరాజు పెళ్లైన నాలుగో రోజు చనిపోతాయడని చెబుతారు. కాలక్రమంలో ఆ రాకుమారుడిని ఓ రాకుమారి వరిస్తుంది. తన జాతకం గురించి చెప్పినప్పటికీ...తననే వివాహం చేసుకుంటానని పట్టుబడుతుంది. చేసేది లేక ఇరు రాజకుటుంబాలు అంగీకరించి వివాహం జరిపిస్తాయి .
తన భర్తని తాను కాపాడుకోగలను అనే ధీమాతో ఉంటుంది ఆ రాకుమారి. జాతకం ప్రకారం నాలుగో రోజు రానే వచ్చింది. ఆ రోజు సాయంత్రం ఇంటి దగ్గర దీపం వెలిగించి..బంగారం, వెండి ఆభరణాలు పోగు పోసింది
రాకుమారుడి ప్రాణం తీసేందుకు పామురూపంలో వచ్చిన యముడు.. ఆ దీపాల కాంతి నగలపై పడడంతో కళ్లు చెదురుతాయి.. అదే సమయంలో రాకుమారి పాటలకు అలానే ఆగిపోతాడు యముడు.ఈలోగా యమ ఘడియలు దాటిపోతాయి..ఖాళీ చేతులతో వెనక్కు తిరుగుతాడు యముడు..
ఆరోజు నుంచి ధన త్రయోదశి రోజు వెండి, బంగారు ఆభరణాలను కొనుగోలు చేసి లక్ష్మీదేవికి పూజ చేయడం అనే సంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు. ఇంటిబయట గుమ్మం దగ్గర సంధ్యాసమయంలో దీపం వెలిగించడం ద్వారా మృత్యుభయం తొలగిపోతుందనే సెంటిమెంట్ బలపడింది.
మట్టి ప్రమిదలలో ఆవు నెయ్యి , నువ్వుల నూనె..రెండింటిలో ఏదైనా పోసి దీపారాధన చేయొచ్చు. దక్షిణ దిక్కుకి అధిపతి యముడు కాబట్టి ఆ దిశగా దీపం వెలిగించాలి.