ABP Southern Rising Summit: హైదరాబాద్ వేదికగా ప్రారంభమైన సదరన్ రైజింగ్ సమ్మిట్, ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి
దేశ అభివృద్ధిలో దక్షణాది విజయాలపై గళం విప్పేలా నిర్వహించే ఏబీపీ నెట్ వర్క్ సదరన్ రైజింగ్ సమ్మిట్ రెండో ఎడిషన్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. చెన్నై వేదికగా నిర్వహించిన తొలి ఎడిషన్ విజయవంతం కాగా, ఈ ఏడాది హైదరాబాద్ సదరన్ రైజింగ్ సమ్మిట్ కు వేదికగా మారింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App“Coming of Age: Identity, Inspiration, Impact” అనే థీమ్‌తో రాజకీయ, సాంస్కృతిక, విద్య, ఆరోగ్య సంరక్షణలో దక్షిణాది ప్రాముఖ్యతను ఈ వేదికగా చర్చించనున్నారు. దేశ పురోగతిలో దక్షిణాది ప్రత్యేకతపై పలు రంగాల ప్రముఖులతో ప్రభావవంతమైన చర్చలు జరుగుతాయి.
సదరన్ రైజింగ్ సమ్మింగ్ తాజా ఎడిషన్ కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. రాజకీయాలపై చర్చిస్తూ తెలంగాణ అభివద్దిపై తన విజన్ ను ఆవిష్కరించనున్నారు.
కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహననాయుడు, భారత ఇండియన్ బాడ్మింటన్ దిగ్గజం పుల్లెలగోపీచంద్, టాలీవుడ్ సినీ ప్రముఖులు సాయి దుర్గా తేజ్, నటి రాశీఖన్నా, జాతీయ నటుడు ప్రకాష్ రాజ్, మంజుమ్మల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం, సీనియర్ నటి గౌతమి తడిమెల్ల వంటి వారు పాల్గొంటున్నారు.
ఈవెంట్లో పాల్గొనేందుకు సినీ, రాజకీయ, పలు రంగాల ప్రముఖులు తరలి వస్తున్నారు. సౌతిండియాతో పాటు ఉత్తరాది రాష్ట్రాల వారు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అక్టోబర్ 25న ఉదయం గం.10 నుంచి రాత్రి 9 గంటల వరకు సదరన్ రైజింగ్ సమ్మిట్ జరగనుంది.