In Pics: ఏబీపీ హెల్త్ కాన్క్లేవ్ 2024 గ్రాండ్ సక్సెస్, హైలైట్స్ ఇవే - ఫోటోలు చూసేయండి
ఏబీపీ దేశం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ‘ఏబీపీ దేశం హెల్త్ కాన్ క్లేవ్ 2024’ ఘనంగా జరిగింది. హైదరాబాద్ లోని బంజారాహిల్స్‌లో ఉన్న రాడిసన్ బ్లూ ప్లాజాలో ఈ కార్యక్రమం జరిగింది. మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఈ ఈవెంట్ కు హాజరయ్యారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ కార్యక్రమానికి వివిధ విభాగాల్లో నిపుణులైన పలువురు సీనియర్ వైద్యులు హాజరై.. చికిత్సా విధానంలో వివిధ ఆవిష్కరణలు, సర్జరీల్లో కొత్త పోకడల గురించి వివరించారు. సిగ్నస్ హాస్పిటల్స్ సీఈవో, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శ్రీవేణు ఐతా హాజరై ఆధునిక ఆహార అలవాట్ల కారణంగా పెరుగుతున్న గ్యాస్ట్రో సమస్యలు అనే అంశంపై మాట్లాడారు.
ప్రముఖ డైటీషియన్ నిఖిల్ చౌదరి, ఊర్వశి అగర్వాల్ (స్ట్రీట్ ఫుడ్) న్యూట్రీషియన్, లైఫ్ స్టైల్ మార్పుల కారణంగా ఆరోగ్యంపై ప్రభావం అనే అంశంపై తమ ఆలోచనలను పంచుకున్నారు.
కిమ్స్ హాస్పిటల్ కు చెందిన డాక్టర్ వి.ఆనంద్ కుమార్ మాట్లాడుతూ.. చర్మ సంబంధిత రోగాల విషయంలో ట్రీట్మెంట్ లో వస్తున్న అడ్వాన్స్మెంట్ గురించి వివిధ విషయాలను చెప్పారు. డాక్టర్ జి.మధు వంశీ, అరుబా కబీర్.. మెంటర్ హెల్త్ అనే అంశంపై మాట్లాడారు. మానసిక ఆరోగ్యంపై ప్రస్తుతం జనం ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రస్తావించారు.
న్యూరో వైద్యులైన డాక్టర్ ఉమేశ్ తుకారాం, యూరాలజిస్ట్ డాక్టర్ వంశీక్రిష్ణ క్రిటికల్ ఇల్నెస్ అనే అంశపై మాట్లాడారు. ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్స్ లో న్యూరో సర్జన్ హెచ్ఓడీ అయిన డాక్టర్ పి.రంగనాథమ్ న్యూరో సర్జరీ ఒకప్పుడు - ఇప్పుడు అనే అంశంపై మాట్లాడారు.
మల్లారెడ్డి మెడికల్ సైన్సెస్ కాలేజీలో అకడమిక్ డీన్ గా ఉన్న డాక్టర్ రమణి క్వాలిటీ మెడికల్ ఎడ్యుకేషన్, నేషనల్ హెల్త్ పాలసీస్ అనే అంశంపై మాట్లాడారు. నెఫ్రాలజిస్ట్ డాక్టర్ గంగాధర్ తాడూరి, తెలంగాణ ఆరోగ్యశాఖ మాజీ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ ‘యూనివర్సల్ హెల్త్ కేర్ - సవాళ్లు, పరిష్కారాలు’ అనే అంశంపై.. మాట్లాడారు. రెయిన్ బో హాస్పిటల్స్ కు చెందిన పీడియాట్రిషియన్ డాక్టర్ షేక్ ఫర్హాన్ ఏ రషీద్ పిల్లల ఆరోగ్యంపై తమ అనుభవాలను పంచుకున్నారు.
ఇండో బ్రిటీష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ వ్యవస్థాపకుడు డాక్టర్ విజయ భాస్కర్ బండికట్ల ‘అడ్వాన్స్డ్ పెయిన్ మేనేజ్ మెంట్’ అంశంపై మాట్లాడారు. డాక్టర్ సత్య సింధూజ ‘సిద్ధా విధానంలో దీర్ఘకాలిక వ్యాధుల నయం’అనే అంశంపై మాట్లాడారు.
ABP హెల్త్ కాన్క్లేవ్ 2024 సదస్సులో తెలంగాణ రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఏ దేశానికి వెళ్లినా తెలంగాణ దగ్గర ఉత్పత్తి అవుతున్న మందులు వాడుతున్నారని తెలిపారు. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విషయంలో ముందంజలో ఉండాలని అన్నారు. పలు ఆరోగ్య సమస్యలపై పరిశోధన జరగాల్సిన అవసరముందని తెలిపారు. ఈ సామాజిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ABP దేశంని అభినందించారు.
రీసెర్చ్‌లో ఎందుకు వెనకబడుతున్నామని ఓ విద్యార్థి అడగ్గా అందుకు మంత్రి బదులిచ్చారు. ఇప్పుడిప్పుడే పరిశోధనలపై అవగాహన పెరుగుతోందని వెల్లడించారు. విద్యార్థులంతా రీసెర్చ్కీ సమయం కేటాయించాలని సూచించారు. మెడికల్ కాలేజీలను పరిశోధనలకు వేదికలుగా మార్చుకోవాలని తెలిపారు.
గిరిజన ప్రాంతాల్లో పని చేసే వైద్యులు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నట్టు తెలిపారు పొన్నం ప్రభాకర్. యువ వైద్యులు స్వచ్ఛందంగా ఏజెన్సీ ఏరియాలకు వెళ్లి పని చేయాలని సూచించారు. ఈ సామాజిక స్పృహ అందరిలోనూ కలగాలని కోరారు.