Parvathy Thiruvothu: విక్రమ్ 'తంగలాన్'లో ఈ మలయాళీ హీరోయిన్ కూడా ఉందండోయ్
Parvathy Thiruvothu Instagram: పార్వతి తిరువొతు... మలయాళీ. కథానాయికగా ఆవిడ రెండు పదులకు పైగా సినిమాలు చేశారు. అయితే... ఆవిడ తెలుగు సినిమాలు చేయలేదు. కానీ, తెలుగు ప్రేక్షకులు కొందరికి తెలుసు. (Image Courtesy: par_vathy / Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపార్వతి ఎక్కువగా మలయాళ సినిమాలు చేశారు. మధ్యలో కొన్ని తమిళ, కన్నడ, హిందీ సినిమాలు సైతం చేశారు. మలయాళ సినిమా 'బెంగళూరు డేస్'లో ఆమె నటనకు ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. లోక నాయకుడు కమల్ హాసన్ 'ఉత్తమ విలన్' తెలుగులో డబ్బింగ్ కావడంతో కొంత మంది ఆ సినిమాలోనూ ఆవిడను చూశారు. (Image Courtesy: par_vathy / Instagram)
చియాన్ విక్రమ్ కథానాయకుడిగా నటించిన 'తంగలాన్' పేరు చెబితే మలయాళీ కథానాయిక మాళవికా మోహనన్ గుర్తుకు వస్తుంది. అయితే... ఆ సినిమాలో ఈ మలయాళీ పార్వతి తిరువొతు సైతం ఉన్నారు. (Image Courtesy: par_vathy / Instagram)
చెన్నైలో జరిగిన 'తంగలాన్' ప్రెస్ మీట్ లో పార్వతి ఈ డ్రస్ లో అటెండ్ అయ్యారు. ఆవిడ లుక్ స్టైలిష్ గా ఉందని పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. (Image Courtesy: par_vathy / Instagram)
హైదరాబాద్ సిటీలో త్వరలో జరగనున్న 'తంగలాన్' ప్రీ రిలీజ్ ఈవెంట్ లేదా ప్రెస్ మీట్ కు పార్వతి రానున్నారు. (Image Courtesy: par_vathy / Instagram)
మరింత మంది కథానాయికలతో పాటు బ్రేకింగ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం ఏబీపీ దేశం ఫాలో అవ్వండి. (Image Courtesy: par_vathy / Instagram)