In Pics: హైదరాబాద్కు దూరంగా బీఆర్ఎస్ నేతల తరలింపు, కార్యకర్తలు రచ్చరచ్చ - ఫోటోలు
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై పీఏసీ ఛైర్మన్ అరికెపూడి గాంధీ, ఆయన అనుచరులు చేసిన దాడిని ఖండిస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వద్ద ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు దాదాపు రెండు మూడు గంటల పాటు రోడ్లపై తిప్పారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవారిలో మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర తదితర నేతలు ఉన్నారు.
రెండు గంటలుగా 100 కిలోమీటర్లకు పైగా రోడ్లపైనే బీఆర్ఎస్ నాయకులను పోలీసులు తిప్పారు. ఒక వాహనాన్ని తలకొండ పల్లి మరో వాహనాన్ని కేశంపేట వైపు తిప్పారు.
తలకొండ పల్లి వద్ద రోడ్డుకు అడ్డుపడి బీఆర్స్ ఎమ్మెల్యేలను తరలిస్తున్న వాహనాన్ని గ్రామ బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి.
కొత్తపేట వద్ద వెయ్యి మందికి పైగా బిఆర్ఎస్ కార్యకర్తలు చేరుకొని బీఆర్ఎస్ నాయకులను తరలిస్తున్న వాహనాలను అడ్డుకున్నారు.
అదుపులోకి తీసుకున్న బీఆర్ఎస్ నాయకులను కేశంపేట పోలీసు స్టేషన్ కు పోలీసులు తరలించారు.
మరో వాహనాన్ని తలకొండపల్లి పోలీసు స్టేషన్ తీసుకు వెళ్లారు. తలకొండ పల్లి పోలీసు స్టేషన్ కు తరలించే మరో వాహనం మార్గమధ్యలో పంచర్ అయింది.
తలకొండ పల్లి పోలీస్ స్టేషన్ నుంచి పలువురు ఎమ్మెల్యేలు తమ సొంత వాహనాల్లో హైదరాబాద్ బయలు దేరి వెళ్లారు.
పోలీస్ వ్యాన్ లోకి లాక్కెళ్లడంతో చేతికి గాయమై బాధ పడుతున్న హరీష్ రావు పట్ల పోలీసులు కర్కశంగా వ్యవహరించారని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.
మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకున్న విషయం తెలుసుకుని కేశంపేట పోలీస్ స్టేషన్ కు వేల సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు.
సీఎం డౌన్ డౌన్ అంటూ కేశంపేట పోలీస్ స్టేషన్ పరిసరాలు మార్మోగుతున్నాయి.
అరెస్టు చేసిన బీఆర్ఎస్ నాయకులను విడిచిపెట్టే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని కార్యకర్తలు తెగేసి చెబుతున్నారు.